Site icon NTV Telugu

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ఎవరినీ వదలడం లేదు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కరోనా మహమ్మారి సోకుతోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇతరులు ఇలా చాలా మంది కరోనా బారీన పడ్డారు. అయితే.. తాజాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. రెండు రోజులుగా అస్వస్థతకు గురైన ఆయన… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. ఈ కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. ఇక అటు గత రెండు రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Exit mobile version