టీఆర్ఎస్-బీజేపీ తోడు దొంగలు.. అందుకే దళిత బంధు ఆగింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ తోడు దొంగలు.. వారివల్లే హుజురాబాద్‌లో దళితబంధు పథకం ఆగిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. దళిత బంధు ఆపడంలో టీఆర్ఎస్-బీజేపీ తోడు దొంగలు.. ఇద్దరి కుమ్మక్కులో భాగమే దళిత బంధు ఆగిపోవడం అని విమర్శించారు.. ఇక, రైతు బంధు అగొద్దని ఎన్నికల కమిషన్ దగ్గర అమలు చేసిన సీఎం కేసీఆర్.. దళిత బంధు విషయంలో ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నించారు. దళిత బంధు పాత పథలం అని టీఆర్ఎస్ చెప్తుంటే.. ఎందుకు ఇప్పుడు ఆగిందని నిలదీశారు రేవంత్‌రెడ్డి.
మరోవైపు సీఎం కేసీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ ఎందుకు దళిత బంధు అమలుకు చొరవ చూపడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి.. కేంద్ర మంత్రులు ఎందుకు ఎన్నికల అధికారులను కలవడం లేదు? అని ప్రశ్నించిన ఆయన.. టీఆర్ఎస్-బీజేపీ ఇద్దరు లంగ నాటకం ఆడుతున్నారని.. అందులో భాగంగానే దళిత బంధు ఆగిపోయిందన్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాదు.. రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మందికి అమలు చేయాలని డిమాండ్ చేశారు రేవంత్‌రెడ్డి. బీసీల మీదకు దళితులను ఉసిగొలిపే చర్యలకు సీఎం దిగుతున్నారని ఆరోపించిన ఆయన.. సీఎం కులాల మద్య చిచ్చు పెట్టే కామెంట్స్ పై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.. కేసీఆర్‌పై కేసు పెట్టి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. దళితులను సీఎంను చేయండి అని దళితులు అడగలేదు.. మూడెకరాల భూమి అడగలేదు.. వర్గీకరణ జరగాలని డిమాండ్ చేశారన్నారు. సీఎం కేసీఆర్‌ని అడుగుతున్న వర్గీకరణ కోసం ఎందుకు ఢిల్లీకి తీసుకెళ్లడం లేదు? అని నిలదీశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
తాజావార్తలు
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?