NTV Telugu Site icon

Lotus Pond Hyderabad: చేపలు చస్తున్నాయ్.. వాసనకు ముక్కులు పోతున్నాయ్

Lotus Pond Hyderabad

Lotus Pond Hyderabad

Lotus Pond Hyderabad: వాతావరణ పరిస్థితులలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎండలు కొడుతూనే వానలు కూడా నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలు, ఎండలు వాతావరణ మార్పులతో జనజీవనమే కాదు.. జీవరాసులపై కూడా ప్రభావం చూపుతుంది. దీంతో నీటి మట్టము క్రమేపి తగ్గడం జరుగుతుంది. వేసవి ముగిసే వరకు నీరు క్రొత్తగా చేరే అవకాశం ఉండదు. ఇటువంటి పరిస్థితులలో నీటిలో వున్న చేపలు మృతి చెందుతున్నాయి. లోటస్‌పాండ్‌ చెరువులో చేపల మృతి కలకలం రేపుతుంది. భారీగా చేపలు చనిపోవడంతో ఆప్రాంతమంతా దుర్వాసన రావడం మొదలైంది. దీంతో వాసన భరించలేక వాకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోటస్‌ పాండ్‌ లో చేపలు చనిపోతే పట్టించుకునే నాధుడు కరువయ్యాడని మండిపడ్డారు.

Read also: Manhole: మ్యాన్‌హోల్‌లో దిగి శుభ్రం చేసిన సిబ్బంది.. వరంగల్ మేయర్, కమిషనర్ సీరియస్‌

నీటిని మార్చనందుకే ఇలా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోటస్‌ పాండ్‌ ను అధికారులు గాలికి వదిలేసారని తీవ్ర ఆరోపణలు చేశారు. చేపలు అన్ని చనిపోతున్న, తీవ్ర దుర్వాసన వస్తున్నా అధికారులు మాత్రం అస్సలు పట్టించుకోకుండా లోటస్‌ పాండ్‌ ను వదిలేసారని మండిపడుతున్నారు. వాకర్లు చేస్తున్నప్పడు విపరీతమైన దుర్వాసన వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు లోటస్‌ పాండ్‌ ను సందర్శించి చేపలను తొలగించాలని కోరుతున్నారు. అయితే నేపథ్యంలో పీసీబీ అధికారులు రంగంలోకి దిగారు. లోటస్‌ పాండ్‌ ను సందర్శించారు. చేపలు ఎందుకు చనిపోయాయి? ఎలా చనిపోయాయని ఆరా తీస్తున్నారు. నీటిని మార్చకపోవడం వల్లే ఇలా జరిగిందా? లేక నీటిలో ఏమైనా విషవాయువు కలిసిందా? అనే విషయమై ఆరా తీస్తున్నారు. చనిపోయిన చేపలను లోటస్‌ పాండ్ నుంచి తొలగించేందుకు ప్రత్నాలు కొనసాగుతున్నాయని, ప్రజలకు ఇబ్బంది గురుకాకుండా ఉండేందుకు అధికారులపై చర్యలు తీసుకుంటామని పీసీబీ అధికారులు వెల్లడించారు.
Manhole: మ్యాన్‌హోల్‌లో దిగి శుభ్రం చేసిన సిబ్బంది.. వరంగల్ మేయర్, కమిషనర్ సీరియస్‌