Pawan Kalyan: తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన కూడా పలు చోట్ల ఎన్నికల బరిలో నిలిచింది. అయితే, జనసేన మొత్తం 32 స్థానాల్లో పోటీ చెయ్యాలి అనుకుంది.. కానీ, కేవలం 11 స్థానాలను బీజేపీ ఫైనలైజ్ చెయ్యడంతో ఆ స్థానాల్లో తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలబెట్టింది. ఇక, తమ అభ్యర్థుల కోసం మాత్రమే కాకుండా బీజేపీ అభ్యర్థుల తరపున కూడా జనసేన అధినేత ప్రచారంలోకి దిగుతున్నారు. ఒకవైపు షూటింగ్స్ చేసుకుంటునే మరో వైపు రాజకీయాలు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. నిన్న వరంగల్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొని.. అనంతరం కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో పర్యటించారు.
ఈనేపథ్యంలో.. నేడు మెదక్ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా చేగుంటలో జరిగే రోడ్ షోలో జనసేనాని పాల్గొననున్నారు. ఇవాళ కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. వరంగల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సకలజనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ కావాలనుకుంటున్నానని.. బీసీలకు సాధికారికత తెలంగాణ కోరుకున్నామని తెలిపారు. ధన బలం లేకున్నా.. మీ ధైర్యం, మీ సహకారంతో జనసేన నడిపిస్తూ వస్తున్నానని చెప్పారు. 2014లో మోదీని ప్రధానిగా చూడాలని ఆయనకు అప్పుడు బలంగా మద్దతు ఇచ్చానన్నారు. అదే స్ఫూర్తితో ఈసారి కూడా ఇక్కడి బీజేపీ నేతలకు అదే మద్దతు ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ప్రదీప్ రావును మంచి మెజారిటీతో గెలిపించాలని కోరిన విషయం తెలిసిందే..
Dhoni : వావ్.. వాట్ ఏ టాలెంట్ భయ్యా.. ధోని ఫ్యాన్స్ కు పండగే..