Site icon NTV Telugu

Pawan Kalyan : నేడు ఉమ్మడి నల్గొండలో పవన్‌ పర్యటన

Pawan Kalyan

Pawan Kalyan

నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పవన్‌ చౌటుప్పల్‌ సమీపంలోని లక్కారం, కోదాడకు వెళ్లనున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్తల కుటుంబాలను పవన్ పరామర్శిస్తారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేయనున్నారు పవన్‌ కల్యాణ్‌. హైదరాబాద్‌ నుంచి బయలుదేరి ముందుగా చౌటుప్పల్‌ సమీపంలోని లక్కారం చేరుకుని.. కొంగర సైదులు కుటుంబ సభ్యులను పవన్‌ కల్యాణ్‌ కలుసుకుంటారు.

అక్కడ నుంచి కోదాడ చేరుకుని.. కడియం శ్రీనివాస్‌ కుటుంట సభ్యులను పవన్‌ కల్యాణ్‌ పరామర్శిస్తారు. గత ఏడాది ఆగస్టు 20న బక్కమంతులగూడెం దగ్గర జరిగిన రోడ్‌ ప్రమాదంలో శ్రీనివాస్‌ మృతి చెందారు. లారీ- శ్రీనివాస్‌ బైక్‌ను ఢీకొనడంతో అకాల మరణం చెందాడు. పవన్‌ కల్యాణ్‌.. హుజూర్‌నగర్‌ వెళ్లి శ్రీనివాస్‌ కుటుంబాన్ని పవన్‌ కల్యాణ్‌ పరామర్శించాల్సి ఉంది. అయితే పర్యటన ఇబ్బందికరంగా మారడంతో కోదాడలోనే బాధిత కుటుంబ సభ్యులను పవన్‌ కల్యాణ్‌ కలువనున్నారు. అనంతరం జనసేనాని కోదాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. పవన్‌ కల్యాణ్‌ టూర్‌కు జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్‌ అభిమానులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

Exit mobile version