Site icon NTV Telugu

Pawan Kalyan: కేటీఆర్ ఛాలెంజ్‌ను స్వీకరించిన పవన్.. మంత్రికి స్పెషల్ ట్వీట్

Challenge A Accepted Pavankalyan

Challenge A Accepted Pavankalyan

Pawan Kalyan Accepted KTR Challenge: ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా.. చేనేత దుస్తులు ధరించాలని తాను ధరించి కొన్ని ఫోటోలను ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసారు కేటీఆర్‌. అంతేకాకుండా చేనేత దుస్తులు ధరించాలని పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా, మాజీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌తో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సవాలు విసిరారు. కేటీఆర్‌ సవాల్‌ ను పవన్‌ స్పందించారు. రామ్‌ భాయ్‌ ఛాలెంజ్‌ స్వీకరించాను. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ను నామినేట్‌ చేస్తున్నా అని ఫోటోలను కూడా ట్వీట్‌ వేదికగా పవన్‌ షేర్‌ చేశాడు.

read also: Manipur: మణిపూర్‌లో 5రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేత.. 2 జిల్లాల్లో 144 సెక్షన్

కేటీఆర్‌ ట్వీట్‌ కు రీ ట్వీట్‌ చేసిన పవన్‌ కళ్యాన్‌ ట్వీట్‌ కు స్పందించిన కేటీఆర్‌ థ్యాంక్స్‌ అన్న అని రిప్లై ఇచ్చాడు. దీంతో సోషల్‌ మీడియా వేడుకగా జరిగిన ఈ సంబాషనలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. జనసేన నేత పవన్‌ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ ను ఛాలెంజ్‌ గా తీసుకోవడంపై ప్రతి ఒక్కరికి ఆసక్తి కరంగా మారింది. చేనేత కార్మిక దినోత్సవం సందర్బంగా కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ పవన్‌ స్పందించడం జనసేన నేతలు, పలువురు ఒకరినొకరు అన్నా అంటూ మాట్లాడు కోవడంపై ఆశక్తి కరంగా మారింది. భాయ్‌ అంటూ పవన్‌ ట్వీట్‌ చేయడం, అన్న అంటూ మంత్రి రీట్వీట్‌ చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వావ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version