Patnam Mahendar Reddy: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, మరోవైపు కేబినెట్ విస్తరణకు శ్రీకారం చుట్టింది కేసీఆర్ సర్కార్. ఇందులో భాగంగా.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమైంది. అయితే నేడు మధ్యాహ్నం 3గంటలకు ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అధికార పార్టీ నేతలు వెల్లడించారు. అయితే మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌కు బర్తరఫ్ పచేసినప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇన్ని రోజులు ఆరోగ్య శాఖను హరీష్ రావు చూసుకుంటున్నారు. కాగా, ఈటల ప్లేస్ ఇప్పుడు బర్తీ చేసేందుకు సన్నాహాలు జరగుతున్నాయి. ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలకు ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తుండగా.. మహేందర్‌రెడ్డి పేరు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. అయితే.. గతంలో మంత్రిగా పనిచేసినా మహేందర్ రెడ్డికి పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పట్నం మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కలిశారు.
Read also: Sai Stotram: రెండో శ్రావణ గురువారం అభిషేకం వీక్షిస్తే సకల శుభాలు చేకూరుతాయి
అయితే ముందుగా మంత్రి పదవి ఖాయమైనా.. గవర్నర్ తమిళిసై అందుబాటులో లేకపోవడంతో ఆ విషయం బయటపెట్టలేదని సమాచారం. కాగా, గవర్నర్ సమయం ఇవ్వడంతో ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రిగా పట్నం ప్రమాణ స్వీకారానికి సమయం ఫిక్స్ అయింది. కాగా, ఈ ఎన్నికల్లో తాండూరు నుంచి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. కానీ.. అక్కడ సిట్టింగ్ గా పైలట్ రోహిత్ రెడ్డి ఉండటం.. మొన్న జరిగిన ఎమ్మెల్యే కొనుగోలు కేసులో పార్టీకి విధేయుడిగా వ్యవహరించడంతో మళ్లీ ఆయనకు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. బుజ్జగింపుల పర్వంలో భాగంగా పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే పట్నం మహేందర్ రెడ్డికి ఏ శాఖను ఇస్తారనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరి ఈటల నిర్వహించిన వైద్యారోగ్య శాఖనే పట్నంకు ఇస్తారా.. లేదా అనేది చూడాలి..!
Guru Graha Doshalu: గురువారం ఈ స్తోత్రం వింటే గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి