Cherlapally ESI Hospital: సార్ మమ్మల్ని పట్టించుకోండి అంటూ రోగులు అధికారులు కోరుతున్న తీరు అందరిని కంటతడిపెట్టించింది. ఆరోగ్యం బాగోలేక వైద్యం కోసం వెలితే గంటల తరబడి డాక్టర్ కోసం వేచి చూడాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటలు గడుస్తున్నా ఇంకా వైద్యుడు రాలేదా అని అక్కడున్న స్టాఫ్ ని అడిగితే మామీదే జులుం చలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోతే ఎవరు మాకు దిక్కు అంటూ రోగులు వేడుకుంటున్న తీరు మేడ్చల్ జిల్లా కాప్రా డివిజన్ పరిధిలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
Read also: Singareni Coal Mines: సింగరేణి గనుల వేలంపై కాంగ్రెస్ ఆగ్రహం.. బీజేపీ- బీఆర్ఎస్పై ఫైర్
మేడ్చల్ జిల్లా కాప్రా డివిజన్ పరిధిలో ఈఎస్ఐ డిస్పెన్సరీ లో పేషంట్స్ ఇబ్బందులకు గురవుతున్నారు. డాక్టర్ సుధీర్ కుమార్ ఇన్చార్జిగా ఉన్న ఈ డిస్పెన్సర్ లో స్టాఫ్ సమయానికి సరిగ్గా రావడం లేదు. దీంతో స్టాఫ్ కోసం, వైద్యుల కోసం పేషెంట్లు గంటల తరబడి లైన్లో నిలబడే పరిస్థితులు. అయినా రోగులను స్టాఫ్ పట్టించుకోవడం లేదు. సమయం గడుస్తున్నా రోగులను పట్టించేకోవడం లేదు, వైద్యులు రాలేదా అని ప్రశ్నిస్తే.. రోగులతో అసభ్యంగా మాట్లాడటమే కాకుండా.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ జులుం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాబ్లెట్స్ కు గంటల తరబడి నిలబడ్డ ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also: India vs Pakistan: భారత్- పాకిస్తాన్ ప్రత్యక్ష చర్చలకు సపోర్ట్ ఇస్తాం..
ల్యాబ్ టెక్నిషన్ టైం కు రాకుండా రోగులతో వాగ్వాదానికి దిగి వారిపైనా అసభ్యంగా మాట్లాడుతున్నాడుని రోగులు అంటున్నారు. డాక్టర్ సుధీర్ కుమార్ సరిగ్గా డిస్పెన్సరీ రాకపోవడం.. ప్రస్తుత డాక్టర్ శివ తను డిప్టేషన్ మీద ఇక్కడికి వచ్చాడని తెలిపారు. ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ అవుట్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు. డిస్పెన్సరీ చర్లపల్లి ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి స్టాఫ్ రిక్వైర్మెంట్ కూడా పెంచాలని పేషెంట్లు కోరుతున్నారు. వైద్యులు, స్టాఫ్ లు అందరూ సమయానికి రావాలని.. దీనిపై ప్రభుత్వం దృష్టి సాదించాలని రోగులు కోరుతున్నారు.
Pawan Kalyan : వారంలో రెండు రోజులే.. పవన్ కల్యాణ్ షాకింగ్ డెసిషన్..?