Site icon NTV Telugu

Passport Seva: రెండో శనివారం కూడా పాస్ పోర్ట్ సేవలు

Passport

Passport

రెండో శనివారం అయిన రేపు కూడా (డిసెంబర్ 10) పాస్‌పోర్టు సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌, బేగంపేట, టోలిచౌకీ, కరీంనగర్‌, నిజామాబాద్‌ పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో సేవలు అందిస్తామని పేర్కొన్నారు. పాస్ పోర్ట్ ల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ విషయం గమనించాలని ఆయన వివరించారు. తత్కాల్, సాధారణ పాస్ పోర్ట్ సేవలు రేపు అందుకోవచ్చు. హైదరాబాద్‌ రీజినల్‌ పాస్‌పోర్ట్‌ పరిధిలోని 14 పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు దరఖాస్తులను ప్రాసెస్‌ చేయడానికి ఈ సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

తత్కాల్‌ కేటగిరీ కింద ప్రాసెసింగ్‌ అప్లికేషన్‌ సమర్పించడానికి అర్హత ఉన్న పత్రాల జాబితా కోసం దరఖాస్తుదారులు పాస్‌ పోర్ట్‌ సేవా పోర్టల్‌ ని చూడవలసిందిగా చెప్పారు. దరఖాస్తుదారులందరూ www.passportindia.gov.in పోర్టల్‌ ద్వారా లేదా mPassportseva యాప్‌లో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో ఎటువంటి వాక్‌ ఇన్‌ అభ్యర్థనలు స్వీకరించబోమని అన్నారు. దరఖాస్తుదారులందరూ తమ పాస్‌ పోర్ట్‌, పాస్‌ పోర్ట్‌ సంబంధిత అవసరాల కోసం మధ్యవర్తులు, బ్రోకర్‌లను ఆశ్రయించొద్దని సూచించారు. పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో పత్రాలను అన్నిటినీ అందచేసి నిర్దేశిత సమయంలో పాస్ పోర్టులు పొందవచ్చన్నారు.

Exit mobile version