NTV Telugu Site icon

Secunderabad: దసరా ఎఫెక్ట్‌.. రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ..

Secendrabad

Secendrabad

Secunderabad: దసరా పండుగల నేపథ్యంలో నగర ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లు, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్టాండ్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. వృత్తి, ఉపాధి రీత్యా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న పొరుగు ప్రాంతాలకు చెందిన వారు భార్యాపిల్లలతో సహా రైళ్లలో తరలివెళుతుండటంతో ప్లాట్‌ఫారమ్‌లన్ని ప్రయాణికులతో కిటకిటలాడాయి. నిన్నటి నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా సెలవులు ఇవ్వడంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి స్టేషన్ల నుంచి అందుబాటులో ఉన్న రైళ్లలో పలువురు తరలిస్తున్నారు. దీంతో ఏపీ, ఉత్తర భారతదేశం వైపు వెళ్లే రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. రైల్వే శాఖ ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ నెలలో దాదాపు 650 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 వరకు పండుగ సీజన్లో, భారతీయ రైల్వే ప్రయాణికుల రద్దీని తీర్చడానికి మొత్తం 6,000 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్ వెయిటింగ్ లిస్ట్‌లు ఉండటం..దీనిని పరిష్కరించడానికి, రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో దాదాపు 170,000 మంది ప్రయాణికులు ప్రతిరోజూ 200 రైళ్లలో సికింద్రాబాద్‌ నుంచి ప్రయాణిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.
Basara Dasara: ముస్తాబైన ‘బాసర’.. నేడు శైలపుత్రి అలంకరణలో అమ్మవారు