NTV Telugu Site icon

Yadadri: కొండపై పార్కింగ్ ఫీజు గంటకు రూ. 500.. క్లారిటీ ఇచ్చిన ఈవో..

Yadadri

Yadadri

యాదాద్రి ఆలయంలో పునర్‌ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ప్రైవేట్‌ వాహనాలను కొండపైకి అనుమతించలేదు అధికారులు.. ఎవ్వరైనా భక్తులు కొండపైకి చేరుకోవాలంటే.. ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించారు.. లేదా మెట్ల మార్గంలో కూడా కొండపైకి చేరుకోవచ్చు.. అయితే, మే 1వ తేదీ (రేపటి) నుంచి యాదగిరిగుట్టపైకి ప్రైవేట్‌ వాహనాలను కూడా అనుమతించనున్నారు.. ఇదే, సమయంలో భక్తులకు షాకిచ్చే ఓ నిర్ణయం తీసుకున్నారు యాదాద్రి ఆలయ అధికారులు.. కొండపైకి అనుమతించే వాహనాలకు భారీగా పార్కింగ్‌ రుసుం వసూలు చేయనున్నారు.. కొండపైకి వెళ్లే వాహనాలకు గంటకు రూ.500 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇక, గంట దాటితే.. ప్రతీ గంటకు అదనంగా రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని.. ఫీజు నుంచి ప్రోటోకాల్‌, దాతల వాహనాలకు మినహాయింపు ఇచ్చినట్టు ప్రకటించారు.

Read Also: Amaravati: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మరో 2 నెలలు ఉచితంగానే..

అయితే, ఇప్పటి వరకు వాహనాలను కొండపైకి అనుమతించాలని డిమాండ్‌ చేస్తున్న భక్తులు.. వాహనాల పార్కింగ్‌ ఫీజును చూసి షాకవుతున్నారు.. ఇంత భారీ తరహాలో ఫీజులు ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.. మరోవైపు, కొండపైకి వాహనాల అనుమతి, పార్కింగ్‌ ఫీజులపై క్లారిటీ ఇస్తూ.. మరో ప్రకటన విడుదల చేశారు అధికారులు.. కొండపైకి వచ్చే వాహనాల్లో కేవలం నాలుగు చక్రాల వాహనములకు మాత్రమే ఫీజు వర్తిస్తుందని స్పష్టం చేశారు.. కొండపైన పార్కింగ్ స్థలం తక్కువగా ఉన్న నేపథ్యంలో.. భారీ సంఖ్యలో వాహనములు కొండపైకి చేరకుండా నివారించేందుకు మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు గమనించాలని యాదాద్రి కార్యనిర్వహణాధికారి ప్రకటించారు.