Parigi DSP Karuna Sagar Reveals Interesting Details About Sireesha Case: వికారాబాద్ జిల్లా పరిగి మండలం కామాపూర్‌లో దారుణ హత్యకు గురైన శిరీష కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్న పరిగి పోలీసులు.. తాజాగా శిరీష బావ అనిల్‌ను అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు. శనివారం రాత్రి ఫోన్ విషయంలో అనిల్, శిరీష మధ్య గొడవ జరగడం.. ఈ క్రమంలోనే అనిల్ కోపంతో శిరీషను కొట్టడంతో.. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అలా వెళ్లిన శిరీష.. ఇంటికి కీలోమీటర్ దూరంలో ఉన్న నీటి కుంటలో శవమై తేలింది. దీంతో.. శిరీషని అనిల్ హత్య చేసి ఉంటాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో శిరీష తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీకాంత్‌లను కూడా ప్రశ్నించారు.
Minister Jagadish Reddy: భట్టి విక్రమార్క విమర్శలకు మంత్రి జగదీశ్ స్ట్రాంగ్ కౌంటర్
మరోవైపు.. పరిగి డీఎస్పీ కరుణ సాగర్ ఈ కేసు గురించి కొన్ని కీలక వివరాల్ని మీడియాతో పంచుకున్నారు. శిరీష హత్య కేసుని తాము వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. త్వరలోనే ఈ కేసులో ఒక ట్విస్టును బయటపెడతామని, ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని తెలిపారు. శనివారం సాయంత్రం శిరీషపై చెయ్యి చేసుకున్న శిరీష అక్క భర్త అనిల్‌పై తమకు అనుమానం ఉందన్నారు. అనిల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని.. శిరీష తండ్రిని, అన్నను ఇప్పటికే ప్రశ్నించామని చెప్పారు. అనిల్‌ను ఇంటరాగేషన్ చేస్తున్నామన్నారు. అతను పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడని తెలియజేశారు. శనివారం రాత్రి 10 గంటలకు శిరీష ఇంట్లో నుంచి బయటకు వెళ్లిందని, హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Sreleela : ఆ తమిళ్ స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిన శ్రీలీల..?
శిరీష రెండు కళ్ళను షార్ప్ కత్తితో పొడిచినట్లు గుర్తించామని, గొంతుపై కట్టినట్లు ఉన్నాయని డీఎస్పీ కరుణ సాగర్ తెలిపారు. అనిల్ కొట్టడంతో.. శిరీష మనస్థాపానికి గురై, ఇంటి నుంచి బయటకు వెళ్లిందని చెప్పారు. శిరీషను కేవలం ఒకరే హతమార్చి ఉంటారని తాము భావించడం లేదన్నారు. ఈ కేసుకి సంబంధించి తాము పలు ఆధారాలు, లీడ్స్ సేకరించామన్నారు.