Site icon NTV Telugu

ఈటల జమున గడియారాల పంపిణిపై టీఆర్ఎస్ కౌంటర్ !

కరీంనగర్ జిల్లా : హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి… ఈటల జమునకు కౌంటర్‌ ఇచ్చారు. ఈటల జమున బౌన్సలర్లను వెంట పెట్టుకొని గడియారాలు పంపిణీ చేస్తుందని… ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు టీఆర్‌ఎస్‌ పార్టీదేనన్నారు. హుజురాబాద్ నియోజక వర్గ ప్రజలు టీఆరెఎస్ పార్టీ, కేసీఆర్ కు అండగా ఉంటారని తెలిపారు.

read also : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..


టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరో వస్తారు కానీ.. కేసీఆర్ ను చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలంటే టీఆరెఎస్ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. బిజెపి కి 28 రాష్ట్రాలు ఉంటాయి… టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉంది ఒకటే తెలంగాణ అని స్పష్టం చేశారు పల్లా.

Exit mobile version