NTV Telugu Site icon

Palla Rajeshwar Reddy : రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు

నిన్న వరంగల్‌లో రాహుల్‌ గాంధీ పర్యటన, రైతు సంఘర్షణ సభ నేపథ్యంలో సభస్థలాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతలు సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ రేవంత్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, కేసీఆర్‌, కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి స్పందిస్తూ.. రేవంత్‌ రెడ్డికి నోటి తీట ఎక్కువ అయ్యిందని, తీట తీరుస్తాం అంటూ అగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అత్యంత బ్లాక్ మెయిలర్ రేవంత్ మారారని ఆయన ధ్వజమెత్తారు. రేవంత్ ఏం తెలుసురా బిడ్డ నీకు…తెలంగాణ సాయుధ పోరాటం గురించి.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జరిగింది తెలంగాణ సాయుధ పోరాటము.. రైతు సంఘర్షణ సభ కాదు.. కాంగ్రెస్ ఘర్షణ సభ అని పెట్టుకో రేవంత్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్.. నీవే పెద్ద డ్రగ్ ఆడిక్ట్‌.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తాం అంటూ ఆయన దుయ్యబట్టారు.