NTV Telugu Site icon

Kaushik Reddy: మీ డిమాండ్ లు మీకు తెలియదా?.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై పాడి కౌశిక్‌ రెడ్డి ఫైర్‌

Kaushik Reddy

Kaushik Reddy

Kaushik Reddy: మీ డిమాండ్ లు మీకు తెలియదా?.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. మా నేత హరీష్ రావు పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గ్రూప్ వన్ నిర్వహణ పై అవగాహన లేనిది జీవన్ రెడ్డి కే హరీష్ రావు కు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్నపుడే వైఎస్ సీఎంగా గ్రూప్ వన్ ఇంటర్వ్యూలకు 1:100 పిలిచారన్నారు. అది సాధ్యం కాదని జీవన్ రెడ్డి మాట్లాడితే ఎట్లా? అన్నారు. భట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడిగా గ్రూప్ వన్ ఇంటర్వ్యూలకు 1:100 పిలవాలని డిమాండ్ చేశారన్నారు. ప్రతి పక్షంలో ఉన్నపుడు ఒక మాట అధికారంలో ఉన్నపుడు ఒక మాట అనేది కాంగ్రెస్ వాళ్లకు అలవాటుగా మారిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also: WhatsApp call Record : వాట్సాప్ కాల్ ఎలా రికార్డ్ చేసుకోవాలంటే..

ఏపీ లో కూడా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ను మార్చి నిరుద్యోగుల డిమాండ్లకు దక్కట్టు వ్యవహరించారని మండిపడ్డారు. వాళ్ళ డిమాండ్ వాళ్ళకే తెలియక పొతే ఎలా? అని ప్రశ్నించారు. హరీష్ రావు ను ఏదైనా విమర్శించే ముందు జీవన్ రెడ్డి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని హెచ్చరించారు. న్యాయవాది ఆయిన జీవన్ రెడ్డి న్యాయమైన మాటలు మాట్లాడాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ పట్టభద్రులకు అన్యాయం చేసేలా మాట్లాడితే ఎట్లా? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల పక్షాన హరీష్ రావు మాట్లాడితే ఉద్యోగాల భర్తీ ఆయనకు ఇష్టం లేదు అని మాట్లాడితే ఎట్లా జీవన్ రెడ్డి అన్నారు. గ్రూప్ వన్ ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే మార్చడానికి లేదని జీవన్ రెడ్డి అతి తెలివి ప్రదర్శిస్తున్నారని తెలిపారు.

Read also: Chocolate Syrup: చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక.. ఫిర్యాదుపై స్పందించిన కంపెనీ

ఒకసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ను జీవన్ రెడ్డి చదువుకోవాలన్నారు. ఏ దశలోనైనా నోటుఫికేషన్ మార్చే అధికారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఉందని జీవన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలు హరీష్ రావు పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు కర్రు గాల్చి వాత పెడతారన్నారు. హరీష్ రావు పని తత్వాన్ని కాంగ్రెస్ నేతలు నేర్చుకోవాలి.. కారు కూతలు కూయొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. హరీష్ రావు ఎవరినీ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఎందుకు ఎదురు దాడికి దిగుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీలు అమలు చేయమంటే ఆరు స్కాం లు చేశారన్నారు. గ్యారంటీలు అమలు చేయక పోతే కాంగ్రెస్ నేతలకు ఏడు చెర్ల నీళ్లు తాగిస్తామన్నారు.
Chocolate Syrup: చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక.. ఫిర్యాదుపై స్పందించిన కంపెనీ