Site icon NTV Telugu

Pace Hospitals: మాదాపూర్ పేస్ హాస్పిటల్ లో దారుణం.. ఠాగూర్ సినిమా సీన్ రిపీట్

Tagore Movie Scene Repated

Tagore Movie Scene Repated

మాదాపూర్ పేస్ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. ఠాగూర్ సినిమాను తలపించేలా వైద్యం చేశారు పేస్ హాస్పిటల్ సిబ్బంది. అసలు విషయం ఏమిటంటే రెండు రోజుల క్రితం లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న క్రమంలో పేస్ హాస్పిటల్ లో లింగంపల్లికి చెందిన ఎల్లమ్మ (60) అనే మహిళను కుటుంబ సభ్యులు చేర్చారు. హాస్పిటల్ చేర్చుకునే సమయంలో రెండు లక్షల 20 వేలు కట్టించుకున్నారు పేస్ హాస్పిటల్ సిబ్బంది. ఇక నిన్న ఉదయం ఎల్లమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని పేస్ హాస్పిటల్ డాక్టర్లు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు.

Chandrababu: సినీ పరిశ్రమపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

అంతేకాక జనవరి 1న డిశ్చార్జ్ చేస్తామని కూడా డాక్టర్లు వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే ఈరోజు ఉదయం డిశ్చార్జ్ చేయకుండా ఎల్లమ్మ పరిస్థితి విషమంగా ఉందని ఇంకా మూడు లక్షలు చెల్లించాలని పేస్ హాస్పిటల్ సిబ్బంది హుకుం జారీ చేశారు. ఇక ఆ మూడు లక్షలు హాస్పిటల్లో డిపాజిట్ చేయడానికి వెళ్లగా ఎల్లమ్మ చనిపోయిందని హాస్పిటల్ సిబ్బంది వెల్లడించారు. ఈ క్రమంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఎల్లమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. అయితే హాస్పిటల్ సిబ్బంది మాత్రం మూడు లక్షలు కడితేనే బాడీని ఇస్తామని తేల్చారు. ఈ నేపథ్యంలో బంధువులు హాస్పిటల్ ముందు ధర్నాకి దిగారు.

Exit mobile version