దేశవ్యాప్తంగా ఓయో హోటల్ బుకింగ్స్ లో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో నిలిచింది.. మొదటి స్థానంలో హైదరాబాద్ ఉండగా, రెండో స్థానంలో బెంగుళూరు ఉంది..ప్రముఖ హాస్పిటాలిటీ టెక్ ప్లాట్‌ఫామ్ ఓయో ట్రావెలోపీడియా 2023 పేరిట సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది.. ఈ ఏడాది అత్యధికంగా ఓయో ద్వారా హోటల్ రూమ్స్ బుకింగ్ అయిన నగరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని పేర్కొంది..
అదే విధంగా బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక టూరిస్ట్ ప్రదేశాల్లో జైపూర్ అగ్రస్థానంలో నిలవగా.. గోవా, మైసూర్, పుదుచ్చేరి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రదేశాల జాబితాలో పూరీ మొదటి ప్లేస్ లో నిలవగా.. అమృత్‌సర్, వారణాసి, హరిద్వార్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.. అలాగే గోరఖ్‌పుర్, దిఘా, వరంగల్, గుంటూర్ వంటి నగరాలు కూడా కిందటేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ రూమ్ బుకింగ్స్ అయినట్లు తెలుస్తుంది..
ఇదిలా ఉండగా రాష్ట్రాల వారీగా చూస్తే..ఉత్తర్‌ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లు ఓయో తెలిపింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నట్లు ఓయో నివేదిక పేర్కొంది. ఈ ఏడాదిలో సెప్టెంబర్ 30న అత్యధిక బుకింగ్స్ నమోదు అయినట్లు నివేదికలో తెలిపారు. అత్యధికంగా బుకింగ్స్ నమోదైన నెలగా మే నెల నిలిచింది. ఇతర లాంగ్ వీకెండ్‌లతో పోలిస్తే సెప్టెంబర్ 30- అక్టోబర్ 2 మధ్య లాంగ్ వీకెండ్ అత్యధిక రూమ్స్ బుక్ అయినట్లు ఓయో తెలిపింది..