Site icon NTV Telugu

షమీని ట్రోల్స్‌ చేస్తున్న వారిపై ఒవైసీ స్పందన

పాకిస్థాన్‌ vs ఇండియా మ్యాచ్‌లో భారత్‌ ఓటమి చెందడంతో టీం ఇండియా బౌలర్‌ మహ్మద్‌ షమీపై సోషల్ మీడియా వేదికగా చాలా మంది ట్రోల్స్‌ చేస్తూ బూతులు తిడుతున్నారు. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. మ్యాచ్‌ అందరూ ఆడితేనే గెలుస్తుందని.. కానీ, కొందరూ కావాలనే షమీని ట్రోల్స్‌ చేస్తున్నారన్నారు. జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటే కేవలం ఒక్క ముస్లిం ఆటగాడినే టార్గెట్‌ చేస్తున్నారు.. ఎందుకనీ ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టి దేశంలో ఎంత ద్వేషం పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇలాంటి విద్వేషాలను ఎవరూ వ్యాప్తి చేస్తున్నారన్నారు. విద్వేషాలతో ఏమీ సాధించలేరని ఆటను ఆటలా చూడాలన్నారు. షమీపై ట్రోల్స్‌ ఆపాలని సూచించారు ఒవైసీ.

Exit mobile version