NTV Telugu Site icon

Oxytocin Bottles: కాసుల కోసం కక్కుర్తి.. పాలల్లో ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజెక్షన్లు..!

Oxytocin Bottles

Oxytocin Bottles

Oxytocin Bottles: పాలు రోజూ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన ఆరోగ్యం, పోషకాలు అందుతాయి. రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల శరీరానికి తగినంత కాల్షియం అందుతుంది. పాలు తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. రోజూ పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. పాలలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలతో నిత్యం పాలు తాగుతుంటారు.పాలతో ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ కల్తీ పాల వల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. గ్రామాల్లోని ఆవులు, గేదెల పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ నగరాల్లో పాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో కొందరు డెయిరీ యజమానులు పాల ఉత్పత్తిని పెంచేందుకు అక్రమ పద్ధతులను అవలంబిస్తున్నారు. నిషేధిత ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజక్షన్ పాడి పశువులకు ఇస్తున్నారు. పాడి పశువులకు ఇచ్చే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ పాల దిగుబడిని పెంచుతుంది. కానీ అది ఆరోగ్యానికి హానికరం. కానీ పాల దిగుబడిని పెంచేందుకు పశువులకు ఉచితంగా ఈ హార్మోన్ ఇంజక్షన్లు ఇస్తారు.

Read also: Job Opportunity: గుడ్ న్యూస్.. జియో, ఎయిర్‌టెల్ కంపెనీల్లో ఉద్యోగాల జాతర

రంగారెడ్డి జిల్లాలోని పశువుల దాణా దుకాణాల్లో ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజక్షన్లు విక్రయిస్తున్నారు. పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెంలోని ఓ దాణా దుకాణంపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల బృందం బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. పదుల సంఖ్యలో ఆక్సిటోసిన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు వేస్తే పాల దిగుబడి పెరుగుతుందని దుకాణం యజమాని పాడి రైతులకు ఈ ఇంజక్షన్లను విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పశువులకు ఈ హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల వాటి పాలు తాగే వారికి ముఖ్యంగా పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అధికారులు చెబుతున్నారు. ఆక్సిటోసిన్ ఇంజెక్ట్ చేసిన ఆవు పాలను తాగడం వల్ల ఆడపిల్లలకు చిన్న వయసులోనే రుతుక్రమం వస్తుంది.

Read also: Minister KTR: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పంపిణీపై కేటీఆర్ సమీక్ష..

మానవ ఆరోగ్యానికి హానికరం అనే కారణంతో భారత ప్రభుత్వం ఈ ఇంజెక్షన్ల వాడకాన్ని నిషేధించింది. దాణా దుకాణంలో 250 ఎంఎల్‌ ఆక్సిటోసిన్‌ 50 బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషణ నిమిత్తం డ్రగ్ కంట్రోల్ లేబొరేటరీకి పంపినట్లు అధికారులు తెలిపారు. ఆక్సిటోసిన్ ఉత్పత్తి మరియు ఉపయోగంపై పరిమితులు ఉన్నాయి. పశువులకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు వేసిన పాడి రైతులకు గతంలో కోర్టు జరిమానా విధించిన కేసులు కూడా ఉన్నాయి. ఆక్సిటోసిన్ ఒక సహజ హార్మోన్. ఇది ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచాలకు కారణమవుతుంది. అప్పుడే ప్రసవించిన తల్లులలో రక్తస్రావాన్ని నియంత్రించడానికి ఈ హార్మోన్ చాలా తక్కువ మోతాదులో ఇస్తుంది.
Rajanikanth : తన వీరాభిమానికి సాయం చేసిన తలైవా.

Show comments