Site icon NTV Telugu

Operation Smile: నేటి నుంచి ఆపరేషన్‌ స్మైల్‌.. జనవరి 31 వరకు నిర్వహణ

Operetion Smail

Operetion Smail

Operation Smile: నిరాశ్రయులైన చిన్నారులు, బాలకార్మికుల రక్షణ కోసం సైబరాబాద్ పోలీసులు నేటి నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్-ఎక్స్ నిర్వహించనున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు సీపీ కార్యాలయంలో కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. రోడ్లపై భిక్షాటన చేస్తూ, కూడళ్లలో సరుకులు విక్రయిస్తున్న వారితో పాటు అక్రమ రవాణాకు పాల్పడుతున్న చిన్నారులను రక్షించి వారికి పునరావాసం కల్పించేందుకు సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లతో 11 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు సైబరాబాద్ డబ్ల్యూఅండ్ సీఎస్‌డబ్ల్యూ డీసీపీ ఎల్‌సీ నాయక్ తెలిపారు.

Read also: Anupama Parameswaran : టిల్లు తో బోల్డ్ పోజ్ ఇస్తూ న్యూఇయర్ విషెస్‌ చెప్పిన అనుపమ..

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బాల కార్మికులు, భిక్షాటన, భిక్షాటన నిర్మూలనకు కృషి చేయాలన్నారు. అలాంటి వారిని రెస్క్యూ హోంకు తరలించాలని సూచించారు. ఆపరేషన్ స్మైల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం దర్పన్ అప్లికేషన్ ద్వారా తప్పిపోయిన పిల్లలను కనుగొనడం. జీవితంలో బాల్యం చాలా ముఖ్యమని, బాల్యం లేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుందన్నారు. జిల్లా అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, బాలల సంక్షేమ కమిటీ చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి బాలకార్మికులు లేకుండా పనిచేయాలన్నారు.
Drinking Water: హైదరాబాద్ ప్రజలు అలర్ట్.. 3,4వ తేదీల్లో నీటి సరఫరా బంద్‌..

Exit mobile version