Online Fraud: ఆదిలాబాద్ జిల్లా లో అధిక డబ్బు ఆశ చూపి ఆన్ లైన్ వేదికగా మోసానికి పడుతున్నారు. రోజుకో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. ఆన్ లైన్ లో చైన్ బిజినెస్ కు తెరలేపారు. 5 వేలు పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయం అంటూ ప్రజలకు బురిడీ కొట్టించారు. దీంతో డబ్బు సంపాదించాలని ఆశతో పల్లె పట్నం వాసులు నమ్మి పెట్టుబడి పెట్టి మోసపోయి లబోదిబో మంటున్నారు. కాస్ట్ కో పేరుతో ఉన్న లింకు పేరుతో చైన్ లింకు బిజినెస్ కు స్టార్ట్ చేశారు కేటుగాళ్లు. అమాయక ప్రజలే టార్గెట్ చేస్తూ ఈ లింగ్ లో ఎంత మంది సభ్యులను చేర్పిస్తే అంత డబ్బులు అంటూ ఆశ చూపారు. దీంతో ఇది నమ్మిన అమాయక జనం ఆదిలాబాద్, జైనాథ్, బేల,భీం పూర్ తో పాటు ఆదిలాబాద్ శాంతి నగర్ లో పదుల సంఖ్యలో ఇందులో బిజినెస్ పెటారు భాదితులు. ముందుగా ఐదు నుంచి 50 వేల వరకు ప్రొడక్ట్స్ పేరు తో పెట్టించుకున్నారు. డబ్బుల ఆశ తో మరికొంత మందిని చేర్పించి ఆదాయం పొందాలని ఆశపడ్డ వారికి నిరాశ మిగిల్చించారు.
Read also: Supreme Court : ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్నిప్రమాదం.. సుప్రీంకోర్టులో విచారణకు డిమాండ్
ఒక్కటి రెండు సార్లు ఆదాయం వచ్చిన డబ్బుల విత్ డ్రా కు అవకాశం ఉందని తెలుపడంతో.. వేల సంఖ్యలో డబ్బులు బిజినెస్ చేశారు. ప్రస్తుతం యాప్ లో పెట్టుబడి పెట్టిన సొంత డబ్బులు సైతం విత్ డ్రా కాకపోవడం తో హైరానా పడ్డ జనం మోసపోయామని గ్రహించి, పోలీసుల కు పిర్యాదు చేయలేక ఆందోళన కు గురవుతున్న భాదితులు.అటు డబ్బులు రాక ఇటు చేర్పించిన వారితో ఇబ్బందులు ఎదుర్కింటున్నారు. గ్రామాల్లో కూలీనాలీ చేసుకునే వారు సైతం యాప్ లో పెట్టుబడి పెట్టి మోసపోయి లబోదిబో మంటున్నారు. డబ్బుకోసం బాధితులు ఎక్కవ కావడంతో చివరకు పోలీసుల కు పిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్న జిల్లా కేంద్రం కు చెందిన కొంత మంది యువకులు. ఇప్పటికైనా అధిక డబ్బు అంటూ ఆశ చూపిన వారిని నమ్మవద్దని, అలాంటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజలు ఇలాంటి కిలాడీలకు పోసపోయి ఉన్న సొమ్మును పోగొట్టుకోవద్దని తెలిపారు.
Ruhani Sharma: చూపులతో మాయ చేస్తున్న రుహాణి శర్మ…