NTV Telugu Site icon

Current Bill: ఒక నెల కరెంట్ బిల్లు రూ.85,76,902.. మూర్ఛపోయిన యజమాని

Curent Bills

Curent Bills

Current Bill: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తోంది. ఈ పథకం గత మూడు నెలలుగా అమలవుతోంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పేదల ఇళ్లల్లో వెలుగులు నింపుతోంది. ఇలాంటి పరిస్థితిలో తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కరెంట్ అధికారుల నిర్లక్ష్యం వలన ప్రతినెల 800 వచ్చే బిల్లు ఏకంగా 85 లక్షల 76,000 92 రూపాయలు రావడంతో గృహ యజమాని ఒక్కసారిగా బిత్తర పోయాడు. కరెంట్ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వకూడదు ఆందోళన చెందుతున్నారు.

Read also: Delhi : ఢిల్లీలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. 6780 మెగావాట్లకు చేరిక

అన్ను లలితా అనే గృహ యజమానికి ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్నారు. ప్రతి నెల కరెంట్‌ బిల్లు రూ.800 వచ్చేదని తెలిపారు. ఎప్పుడు రూ.800 వచ్చే కరెంట్‌ బిల్లు అంతకు మించి రాలేదని కానీ మే 7వ తేదీన కరెంట్ బిల్లు చూసి షాక్‌ తిన్నాడు. వందలు వేలు కాకుండా ఏకంగా లక్షల్లో బిల్లు రావడంతో మూర్ఛవచ్చినంత పనైంది యజమానికి. కరెంట్ బిల్లు ఏకంగా 85 లక్షల 76,000 92 రూపాయలు రావడంతో వెంటనే తేరుకున్న యజమాని కరెంట్‌ కార్యాలనికి ఫోన్‌ చేశాడు. అయితే అక్కడ ఎవరు ఫోన్‌ కాల్ లిఫ్ట్‌ చేయకపోవడంతో ఏం చేయాలో తెలియలేదు. ఎవరిని ఆశ్రయించాలో అర్థంకానీ పరిస్థితిల్లో ఒకటికి రెండు మార్లు కరెంట్‌ అధికారులకు కాల్ చేస్తునే వున్నాడు. అయినా ఎవరూ స్పందించక పోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.

Read also: Encounter: ఢిల్లీలో కాల్పులకు పాల్పడిన నిందితుడి ఎన్ కౌంటర్..

కరెంట్‌ అధికారులు దీనిని వెంటనే స్పందించాలని కోరుతున్నాడు. అయినా ఇంత ఫ్రాడ్‌ జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పై ఫైర్‌ యజమాని మండిపడుతున్నాడు. ఇదెక్కడి కరెంట్‌ బిల్లు ఎవరైనా ఒక గృహానికి ఇంత కరెంట్‌ బిల్లు వేస్తారా? అని ప్రశ్నింస్తున్నాడు. కరెంట్‌ అధికారుల నిర్లక్ష్యాన్ని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని కోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కరెంట్‌ అధికారులపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని అన్ను లలితా కోరుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం, కరెంట్‌ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Read also: Delhi : ఢిల్లీలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. 6780 మెగావాట్లకు చేరిక

వేసవి ఎండల కారణంగా కరెంట్‌ వినియోగం ఎక్కువగా ఉండడంతో బిల్లు ఎక్కువగా వచ్చేదని ట్రాన్స్‌ కో అధికారులు భావించారు. కానీ కరెంట్ బిల్లు ఏకంగా 85 లక్షల 76 వేల 92 రూపాయలు రావడం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. మీటర్‌లో లోపం ఉందా? లేక ఆ లైన్ లో ఎక్కడైనా లోపం వల్ల ఈ మీటర్ పై లోడ్ చూపుతోందా అనే అంశంపై విచారణ చేపట్టారు. ట్రాన్స్ కో అధికారులు సమస్యను గుర్తించి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.
Delhi : ఢిల్లీలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. 6780 మెగావాట్లకు చేరిక