Site icon NTV Telugu

దేశ స్థాయిలో మార్మోగిన సిద్ధిపేట ఖ్యాతి

మరోసారి దేశవ్యాప్తంగా సిద్ధిపేట పేరు మార్మోగిపోయింది. ప్రసిద్ధి పేటగా… తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింప జేసింది. సిద్ధిపేట శుద్ధిపేట అని మరోసారి చాటి చెప్పింంది. స్వచ్ సర్వేక్షన్ లో జాతీయ స్థాయి లో ఎంపిక అయిన సిద్ధిపేట పట్టణం. ఈ సంద‌ర్భంగా సిద్దిపేట ప్రజలకు మంత్రి హ‌రీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల భాగ‌స్వామ్యంతోనే ఈ విజ‌యం సాధ్యమైందన్నారు. ఈ నెల 20వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సిద్ధిపేట మున్సిప‌ల్‌ చైర్మన్‌ మంజుల రాజనర్సు, క‌మిష‌న‌ర్ ర‌మ‌ణా చారి ఈ అవార్డును అందుకోనున్నారు. తడి, పొడి, హానికరమైన చెత్త సేకరణలో వాహనాల నిర్వహణ , వీటి ప్రక్రియ‌, పారిశుద్ధ్య కార్మికుల పనితీరు, సర్టిఫికేషన్ విధానం, ప్రజల భాగస్వామ్యం, చైతన్యం, స్వచ్ యాప్ ఉపయోగించడం వంటి కార్యక్రమాలను సంపూర్ణంగా అమ‌లు చేయ‌డంతో ఈ అవార్డు వ‌రించింది.

ఇప్పటి వ‌ర‌కు సిద్దిపేట మున్సిపాలిటీకి వ‌చ్చిన అవార్డులు..
2012 క్లిన్ సిటీ ఛాంపియన్ షిప్ అవార్డు – రాష్ట్ర స్థాయి.
2015 ఎక్సలెన్స్ అవార్డు ( సాలీడ్ వెస్ట్ మేనేజ్ మెంట్ ) – జాతీయ స్థాయి
2016 ఎక్స్ లెన్స్ అవార్డు పారిశుద్ధ్య నిర్వహణ – జాతీయ స్థాయి
2016 హరిత మిత్ర అవార్డ్ రాష్ట్ర స్థాయి
2016 స్కాచ్ అవార్డు చెత్త సేకరణ, 100% మరుగుదొడ్ల నిర్మాణం లో జాతీయ స్థాయి అవార్డ్
2016 ఓడీఎఫ్ సర్టిఫికెట్ జాతీయ స్థాయిలో
2016 ఎక్స్ లెన్స్ అవార్డు రాష్ట్ర స్థాయిలో ..
2017 రాష్ట్రీయ స్వచ్ భారత్ పురస్కార్ జాతీయ స్థాయి
2017 బెస్ట్ మున్సిపాలిటీ అవార్డ్ సీఎం గారిచే రాష్ట్ర స్థాయి అవార్డు ..
2017 ఐఎస్వో అవార్డు జాతీయ స్థాయి
2018 – సాలీడ్ మేనేజ్మెంట్ లో స్కాచ్ అవార్డ్ జాతీయ స్థాయి
2018 స్వచ్ఛత ఎక్స్ లెన్స్ అవార్డు జాతీయ స్థాయి
2018 స్కోచ్ అవార్డ్ 6 పద్ధతులు అమలులో ఉన్నందున జాతీయ స్థాయి
2018 స్వచ్ సర్వేక్షన్ లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం..
2019 స్వచ్చత ఎక్స్ లెన్స్ అవార్డ్ జాతీయ స్థాయిలో
2019 స్వచ్ సర్వేక్షన్ అవార్డ్ జాతీయ స్థాయిలో…( దక్షిణ భారత దేశంలో రెండవ స్థానంలో )
2021 సిద్దిపేట పట్టణం లో 100% ఇంటింటికి స్వచ్చమైన త్రాగు నీటి సరఫరా నిర్వహణ కు రెండు స్కాచ్ అవార్డులు..
2021 దేశ స్థాయిలో స్వచ్ సర్వేక్షన్ అవార్డు కు ఎంపిక

Exit mobile version