NTV Telugu Site icon

Eclipse Effect: తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు బంద్‌.. సాయంత్రం శుద్ధి అనంతరం స్వామివారి దర్శనం

Eclipse Effect

Eclipse Effect

Eclipse Effect: సూర్యగ్రహణంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను ఇవాళ మూసివేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ఉ.8 నుంచి రా.7.30 వరకు, విజయవాడ దుర్గగుడిని ఉ.11 గంటలకు, యాదాద్రి ఆలయాన్ని ఉ.8.50 నుంచి రేపు ఉ.8 వరకు, భద్రాద్రి రామాలయం ఇవాళ ఉ.10 నుంచి రా.7 వరకు మూసివేయనున్నారు. అటు శ్రీశైలం ఆలయాన్ని ఇవాళ రాత్రి 6 గంటల వరకు మూసివేయనుండగా.. కొండగట్టు, వేములవాడ, సింహాచలం, ధర్మపురి, అన్నవరం ఆలయాలు మూసివేశారు. ఈ ప్రభావం 1 గంట 45 నిమిషాలకు వరకు గ్రహణంఘడియలు ఉండనందున ఆలయం మూసివేస్తున్నట్లు అధికారం ఉంటుందని వెల్లడించారు.

తెలంగాణ:
యాదగిరి గుట్ట దేవస్థానాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. మంగళవారం ఉదయం 8.50 గంటల నుంచి 26 గంటల వరకు ఆలయంలోకి ప్రవేశం ఉండదని ప్రకటించారు. గ్రహణం కారణంగా నిత్య, సత్సవ కల్యాణం, సత్సవ బ్రహ్మోత్సవాలు కూడా రద్దయ్యాయి. 26న నిర్వహించే శతఘట్టాభిషేకం, సహస్రనామార్చనలు నిర్వహించబోమని అధికారులు ప్రకటించారు. బుధవారం సంప్రోక్షణ అనంతరం ఉదయం 10 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

గ్రహణం కారణంగా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. రేపు ఉదయం 8.30 గంటల నుంచి దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ అర్చకులు ప్రకటించారు. సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం 6 గంటలకు భక్తులను అనుమతిస్తామని ప్రకటించారు. సూర్యగ్రహణం కారణంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మంగళవారం మూతపడనున్నాయి. బుధవారం భక్తులకు మళ్లీ దర్శనం కల్పించనున్నారు.

సూర్యగ్రహణం సందర్భంగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం మూసివేశారు అధికారులు. ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు మూతపడనున్న కొమురవెల్లి ఆలయం అధికారులు వెల్లడించారు.

మెదక్ సూర్యగ్రహణం సందర్భంగా ప్రముఖ ఏడు పాయల వనదుర్గా భవాని ఆలయం మూసివేశారు. ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ సిబ్బంది పేర్కొన్నారు.

సూర్యగ్రహణం సందర్భంగా జగిత్యాలజిల్లా ధర్మపురిశ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని మూసివేసారు ఆలయ అర్చకులు. ఉదయం 5 గంటలకు అన్ని దేవాలయాలలో ప్రాత కాల పూజ అనంతరం ఆలయాన్ని మూసివేసిన ఆలయ అర్చకులు. తిరిగి రేపు ఆరు గంటలకు గ్రహణం అనంతరం సంప్రోక్షణ చేసి ఆలయాన్ని తెరనున్న ఆలయ అధికారులు తెలిపారు. 8 గంటల నుండి భక్తుల దర్శనానికి అనుమతించనున్నట్లు వెల్లడించారు.

రాజన్నసిరిసిల్ల జిల్లా సూర్యగ్రహణం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని మూసివేశారు ఆలయ అర్చకులు. ఉదయం సుప్రభాత సేవ ప్రాతక్కాల పూజ అనంతరం ఆలయ అర్చకులు ఆలయాన్ని మూసివేశారు. గ్రహణం అనంతరం ఆరు గంటలకు ఆలయాన్ని తెరవనున్న ఆలయ అధికారులు వెల్లడించారు. 8 గంటల నుండి భక్తుల దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు.

Mumbai: దీపావళి బాంబులు పేల్చొద్దన్నాడని కత్తితో పొడిచి చంపేశారు

ఆంధ్రప్రదేశ్‌:
నేడు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు అధికారులు. నేటి సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం కార‌ణంగా.. ఉద‌యం 8 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యం మూసివేశారు అధికారులు. గ్రహణం కారణంగా ద‌ర్శనాలకు బ్రేక్‌ పడింది. ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం, వృద్ధులు, విక‌లాంగులు, చంటిపిల్లల త‌ల్లిదండ్రులు, ర‌క్షణ సిబ్బంది, ఎన్ఆర్ఐల ద‌ర్శనంతోపాటు.. ఆర్జిత సేవ‌లైన క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్రదీపాలంకార‌సేవ‌ల‌ను రద్దు చేసింది టీటీడీ. గ్రహణం అనంతరం స‌ర్వద‌ర్శనం భ‌క్తుల‌ను మాత్రమే అనుమ‌తించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

సూర్య గ్రహణం కావటంతో నేడు ఇంద్రకీలాద్రి మూసివేశారు అధికారులు. అమ్మవారి పూజల అనంతరం 11 గంటలకు ఇంద్రకీలాద్రికి తాళాలువేశారు.రేపు ఉదయం ఆరుగంటలకు స్నాపనభిషేకం, పూజలు తర్వాత తెరుచుకోనున్న ఆలయాలు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులకు దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ.

నేడు సూర్యగ్రహణం సందర్భంగా సింహాద్రి అప్పన్న భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. ఉదయం 6 గంటల నుండి 9 వరకే భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా అన్ని ఆర్జితసేవలు రద్దు చేశారు అధికారు. తిరిగి రేపు ఉదయం సుప్రభాత సేవ అనంతరం 6 గంటల నుండి ఎదావిధిగా భక్తులకు స్వామి దర్శనాలకు అనుమతిస్తామని ఈవో త్రినాథరావు తెలిపారు.

శ్రీ సత్య సాయి జిల్లా సూర్యగ్రహణం నేపథ్యంలో లేపాక్షి లోని శ్రీ దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయం మూసివేత. ఆలయం శుద్ధి అనంతరం రేపు భక్తులకు పునఃదర్శనం కల్పించనున్నారు. ఇక కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం తలుపులు మూసివేశారు అధికారులు. సంప్రోక్షణ తర్వాత రేపు పునఃదర్శనానికి భక్తులకు అనుమతించనున్నారు.

అనంతపురం జిల్లా సూర్య గ్రహణం సందర్భంగా గుంతకల్ కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం మూసివేశారు అధికారులు. సంప్రోక్షణ తర్వాత దర్శనానికి భక్తులకు అనుమతించనున్నారు.

విజయనగరం జిల్లాలోని నేడు సూర్యగ్రహణం కారణంగా ప్రధాన ఆలయాలన్నీ మూసువేశారు అధికారులు. సూర్యగ్రహణం కారణంగా‌ రామతీర్థంలో కొలువైన రాములవారి ఆలయం‌ నేడు మూసివేస్తున్నట్టు ఆలయ ఈవో ప్రకటించారు.

ఏలూరు లోసూర్యగ్రహణం కారణంగాద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయం మూసివేశారు. రేపు ఉదయం ఆలయ శుద్ధి అనంతరం స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.

నేడు సూర్యగ్రహణం సందర్భంగా కాకినాడలో ఉదయం 11 గంటల నుండి అన్నవరం సత్యదేవుని ఆలయం మూసివేశారు అధికారులు. రేపు ఆలయ సంప్రోక్షణము అనంతరం ఉదయం 6 గంటల నుండి యదా విధిగా స్వామివారి దర్శనాలు వ్రతాలు సేవలు ప్రారంభించనున్నారు.

సూర్య గ్రహణం సందర్భంగా కర్నూలు జిల్లాలో నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో పూజలు నిలిపివేశారు అధికారులు. నేడు కౌతాళం మండలం ఉరుకుందు ఈరన్న స్వామి దేవాలయం మూసివేశారు.

సూర్యగ్రహణం కారణంగా నంద్యాలలో బనగానపల్లె (మం) యాగంటి ఉమామహేశ్వరస్వామి, నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయాలు మూసివేశారు అధికారులు. ఉదయం 6 నుండి సాయంత్రం 6.30 వరకు ఆలయ ద్వారాలు మూసివేశారు. సాయంత్రం 6.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుద్ధి సంప్రోక్షణ ఉంటుంది. రాత్రి 7 గంటలకు నుండి ఉమాహేశ్వరస్వామి, చౌడేశ్వరి అమ్మవార్ల దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.

నంద్యాలలో సూర్య గ్రహణం కారణంగా శ్రీశైల మల్లన్న ఆలయ ద్వారాలు,స్వామి అమ్మవారి ఉభయ దేవాలయాల ద్వారాలను మూసివేసిన అధికారులు.తిరిగి సాయంత్రం 6 గంటల30 కి ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ నిర్వహించి..రాత్రి 8 గంటల నుండి భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు.

నేడు కాళహస్తీలో సూర్యగ్రహణ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అధికారులు. సాయంత్రం 5.11గం నుండి 6.40 వరకు పాక్షిక సూర్యగ్రహణం కారణంగా.. శ్రీకాళహస్తి దేవస్థానంలో గ్రహణ కాల సమయంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకం చేయనున్న అర్చకులు తెలిపారు. గ్రహణం సందర్భంగా తెరిచే ఉండనున్న శ్రీకాళహస్తి ఆలయం.. రాహు కేతు పూజలు భక్తులకు యధాతథంగా నిర్వహించబడునుంది. స్వాతి నక్షత్రంలో సూర్యగ్రహణం సంభవించును కనుక స్వాతి నక్షత్రం వారు, తుల రాశి వారు ఈ సూర్యగ్రహణంను చూడరాదని వెల్లడించారు.
CM Jagan : ఆర్థిక శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

Show comments