Site icon NTV Telugu

హ‌న్మ‌కొండ‌లో ఒమిక్రాన్ క‌ల‌క‌లం..ఓ మ‌హిళ‌కు పాజిటివ్‌

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ క‌ల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8 కి చేరింది. తాజాగా హ‌న్మ‌కొండ‌కు చెందిన ఓ మ‌హిళ‌కు ఒమిక్రాన్ పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్ రావు పేర్కొన్నారు. ఇటీవ‌లే ఆ మ‌హిళ విదేశాల నుంచి వ‌చ్చిన‌ట్లు హెల్త్ డైరెక్ట‌ర్ పేర్కొన్నారు.

రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి ఒమిక్రాన్ వ‌చ్చింద‌ని.. మిగతావి నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారికి వచ్చిన‌ట్లు వెల్ల‌డించారు. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయపడాల్సిన అవసరం లేదని.. ఒమిక్రాన్ బాధితుల్లో వ్యాధి లక్షణాలు లేవని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఒమిక్రాన్ వల్ల ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కరు తప్ప ఎవరూ చనిపోలేదన్నారు. కానీ ఒమిక్రాన్ పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని ఆయ‌న వెల్ల‌డించారు. రెండు డోసుల వాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఒమిక్రాన్ వచ్చే అవకాశం ఉందని ఆయ‌న పేర్కొన్నారు..

Exit mobile version