Site icon NTV Telugu

Oasis Janani Yatra: వరంగల్ చేరిన ‘ఓయాసిస్ జనని యాత్ర’.. దంపతులకు ఉచిత ఫెర్టిలిటీ సంప్రదింపులు!

Oasis Janani Yatra

Oasis Janani Yatra

భారతదేశంలో అత్యంత విశ్వసనీయ రీప్రొడక్టివ్ మెడిసిన్ సంస్థల్లో ఒకటైన ‘ఓయాసిస్ ఫెర్టిలిటీ’ దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ అవగాహన పెంచే లక్ష్యంతో చేపట్టిన ‘ఓయాసిస్ జనని యాత్ర’ వరంగల్ చేరింది. టైర్ I, ఈ, III ప్రాంతాల్లో ఫెర్టిలిటీ అవగాహన, నిపుణుల మార్గదర్శకం, ఫెర్టిలిటీ స్క్రీనింగ్ సేవలను నేరుగా ప్రజలకు అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా IMA వరంగల్ ప్రెసిడెంట్, కాళోజి నారాయణ రావు హెల్త్ యూనివెర్సిటి రిజిస్ట్రార్ డా నాగార్జున్ రెడ్డి.. IMA వరంగల్ సెక్రెటరి డా అజిత్ మొహమ్మద్.. IMA వరంగల్ ట్రెషరర్ డా శిరీష్ కుమార్.. WOGS వరంగల్ ప్రెసిడెంట్ డా శ్రీలక్ష్మి.. WOGS – వరంగల్ సెక్రటరీ డా కూరపాటి రాధిక హాజరై ఫెర్టిలిటీ అవగాహనను కుటుంబాలకు దగ్గర చేస్తూ, సమాజ స్థాయి ఆరోగ్య చైతన్యాన్ని బలోపేతం చేస్తున్న ఓయాసిస్ ఫెర్టిలిటీ ప్రయత్నాలను అభినందించారు.

జీవనశైలి మార్పులు, ఆలస్య వివాహాలు, శాస్త్రీయ అవగాహన లోపం వంటి కారణాలతో ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, ఓయాసిస్ జనని యాత్ర బస్సు దంపతులకు ఉచిత ఫెర్టిలిటీ సంప్రదింపులు, ఉచిత ఎ ఎం హెచ్ పరీక్ష, ఉచిత వీర్య పరీక్ష, ఉచిత హీమోగ్లోబిన్ పరీక్షలు వంటి సేవలను అందిస్తోంది. శుభ్రమైన, సురక్షితమైన నమూనా సేకరణ ప్రాంతాలతో ఈ సేవలు మరింత సౌకర్యవంతంగా అందించబడుతున్నాయి. ఫోర్ట్ వరంగల్ తర్వాత ఈ జనని యాత్ర, తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి, జమ్మికుంట, మహబూబాబాద్ ప్రాంతాలకు వెళ్లి మరిన్ని సముదాయాలకు అవగాహనను తీసుకెళ్లనుంది.

ఈ సందర్భంగా ముఖ్య అతిధి IMA వరంగల్ ప్రెసిడెంట్ మరియు కాళోజి నారాయణ రావు హెల్త్ యూనివెర్సిటి రిజిస్ట్రార్ డా నాగార్జున్ రెడ్డి గారు మాట్లాడుతూ, “శాస్త్రీయ సమాచారం సమాజానికి చేరితే కుటుంబాలు శక్తిమంతం అవుతాయి, భయాలు, అపోహలు తొలగుతాయి, ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నిపుణులను కుటుంబాలకు చేరువ చేసి, వారికి అవగాహనతో శక్తినిస్తున్న ఓయాసిస్ ఫెర్టిలిటీని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.” అని అన్నారు.

డా. దుర్గా జి. రావు, మెడికల్ డైరెక్టర్ & కో-ఫౌండర్, ఓయాసిస్ ఫెర్టిలిటీ, “సైన్స్ ఫెర్టిలిటీ రంగాన్ని మారుస్తున్న ఈ సమయంలో, ఓయాసిస్ జనని యాత్ర ఆధునిక, సాక్ష్యాధారిత ఫెర్టిలిటీ గురించిన సమాచారాన్ని సమాజాల మధ్యకు నేరుగా తీసుకెళ్తోంది. ఫెర్టిలిటీ యాత్రను ప్రారంభిస్తున్న దంపతులకు తొందరగా వైద్య మార్గదర్శకాన్ని అందించడం ద్వారా భవిష్యత్తుకు ఆరోగ్యకరమైన మార్గం సృష్టిస్తుంది.” అని వ్యక్తపరిచారు.

Also Read: Akhanda 2 Thaandavam: మరికొన్ని గంటల్లో రిలీజ్.. ‘అఖండ 2’ నుంచి ఎమోషనల్‌ ఆడియో సాంగ్‌!

శ్రీ పుష్కరాజ్ షెనాయ్, సీఈఓ, ఓయాసిస్ ఫెర్టిలిటీ, “భారతదేశ ఫెర్టిలిటీ రేటు నిరంతరం పడిపోతున్న ఈ సమయంలో, సమయానుకూలమైన, అందుబాటులో ఉన్న ఫెర్టిలిటీ సంరక్షణ మరింత ముఖ్యమైంది. నిపుణుల కన్సల్టేషన్, డయగ్నస్టిక్స్, అవసరమైన మార్గదర్శకంతో ‘గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్’ను గ్రామీణ స్థాయికి విస్తరించుతున్నాం. ప్రతి దంపతి సరైన నిర్ణయాలు తీసుకునేలా సకాలంలో సహాయం అందించడం మా ధ్యేయం.” అని తెలిపారు..

డా. కావ్య రావు జలగం, రీజినల్ మెడికల్ హెడ్ & ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, “మునుపటి జనని యాత్రకు వచ్చిన అపార స్పందన దంపతులు సరైన మార్గదర్శకాన్ని ఎంత విలువగా తీసుకుంటారో చూపించింది. ఇంకా ఫెర్టిలిటీపై అవగాహన తక్కువగా ఉన్న ఈ ప్రాంతాల్లో సరైన సమాచారం, సానుభూతితో కూడిన సహాయాన్ని అందించడం మా ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.” అని అన్నారు.

ఒయాసిస్ ఫర్టిలిటీ గురించి:
2009లో స్థాపించబడిన ఓయాసిస్ ఫెర్టిలిటీ, భారతదేశవ్యాప్తంగా 34 కేంద్రాలతో అగ్రగామి రీప్రొడక్టివ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్. శాస్త్రీయ నైపుణ్యం, నైతిక వైద్యపద్ధతులు, అత్యున్నత IVF విజయశాతాలతో ప్రసిద్ధి చెందిన ఓయాసిస్, ఇన్నాళ్లుగా అనేక కుటుంబాలకు ఆరోగ్యకరమైన బిడ్డలను అందించింది. పురుషులు మరియు మహిళల కోసం ఐవీఎఫ్, ఐయూఐ , ICSI, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ వంటి విస్తృత సేవలను ఆధునిక ల్యాబ్ టెక్నాలజీ, వ్యక్తిగత సంరక్షణ, సంపూర్ణ వెల్‌నెస్ సహకారంతో అందిస్తోంది.

Exit mobile version