NTV Telugu Site icon

School Bus Overturned: నర్సింగ్ కాలేజ్ స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థినిలకు గాయాలు

Narsingh Bus Accident

Narsingh Bus Accident

School Bus Overturned: నల్గొండ జిల్లా నకిరేకల్ శివారులో నర్సింగ్ కాలేజ్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థినిలు గాయపడ్డారు. సూర్యాపేట కు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు నల్లగొండ జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళ్తుండగా.. నకిరేకల్ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైవే నుండి నల్గొండ వైపు రోడ్డు టర్న్ తీసుకుంటుండగా ఎదురుగా లారీ రావడంతో అదుపుతప్పి స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి నర్సింగ్ స్కూల్ బస్ అతివేగం కారణంగా భావిస్తున్నారు. గాయపడ్డ వారిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ స్కూల్ బస్సులో ఆక్యుపెన్సికి మించి విద్యార్థినిలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read also: Bhupendrabhai Patel: నేడు గుజరాత్ సీఎంగా భూపేంద్ర ప్రమాణ స్వీకారం

విద్యార్థినిలకు ప్రమాదం తెలుసుకున్న తల్లిదండ్రలు హుటా హుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. తమ పిల్లలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. బస్సు డ్రైవర్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లారీ వస్తున్నట్లు గమనించకుండా.. బస్సులో వున్న సీట్ల పరిమాణం కన్నా ఎందుకు విద్యార్థులను ఎక్కించారని మండిపడ్డారు. కాలేజీ యాజమాన్యం దీనిపై విచారణ చేపట్టాలని అన్నారు. పరీక్షలు రాసేందుకు వెళ్తున్నానని తమ పిల్లలు బస్సు ఎక్కారని ఇంతలోనే ఈఘటన చోటుచేసుకుందని వాపోయారు. స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతోనే ఈఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్కూల్ యాజమాన్యం దీనిపై స్పందించాలని కోరారు.

ఈ ప్రమాదంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 15 మంది విద్యార్థులు గాయపడ్డారని, వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్య అధికారులు మంత్రికి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
PM Modi: గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రారంభించిన మోదీ