హైదరాబాద్ హాస్పిటల్ లో నో బెడ్స్.. ఐదు నిముషాలకో అంబులెన్స్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో కరోనా బెడ్స్ దొరికే పరిస్థితి లేదు.. ఇప్పటికే ఆస్పత్రుల్లోని బెడ్లన్నీ పేషెంట్లతో నిండి పోయాయి.. లకిడికాపూల్ ఓ ఆస్పత్రిలో కరోనా కోసం 40 బెడ్లు కేటాయించారు. మొత్తానికి మొత్తం రోగుల తో నిండిపోవడంతో కొత్తవాళ్ళు చేరే పరిస్థితి లేదు. ఒక్కటి హాస్పిటల్ లోనే కాదు దాదాపు చాలా హాస్పిటల్స్ లో అదే పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన నేపధ్యంలో అన్ని హాస్పిటల్స్ లో చికిత్స మొదలు పెడితే పరిస్థితి మారే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెడ్ల కొరతపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రభుత్వాస్పత్రుల్లో వీలైనన్ని బెడ్లను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించింది. బెడ్ల కొరతతో కరోనా బాధితులు అల్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 108 ప్రభుత్వాస్పత్రుల్లో ఐసీయూ, జనరల్ బెడ్లకు లోటు లేకుండా చూసుకోవాలి అని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2106 ఐసీయూ బెడ్లకు గాను సుమారు 1500 ఐసీయూ బెడ్లు ఖాళీగా ఉన్నట్టు చెబుతున్నారు. 4174 జనరల్ బెడ్లకు గానూ సుమారు 3 వేల బెడ్లు ఖాళీగా ఉన్నాయంటోన్న అధికారులు. జిల్లాల వారీగా బెడ్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలపాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Also Read
- Tags
- Beds
- Hospital Beds
- telangana
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!