NTV Telugu Site icon

హైదరాబాద్ హాస్పిటల్ లో నో బెడ్స్.. ఐదు నిముషాలకో అంబులెన్స్ ?

హైదరాబాద్ లో కరోనా బెడ్స్ దొరికే పరిస్థితి లేదు.. ఇప్పటికే ఆస్పత్రుల్లోని బెడ్లన్నీ పేషెంట్లతో నిండి పోయాయి.. లకిడికాపూల్ ఓ ఆస్పత్రిలో కరోనా కోసం 40 బెడ్లు కేటాయించారు.  మొత్తానికి మొత్తం రోగుల తో నిండిపోవడంతో  కొత్తవాళ్ళు చేరే పరిస్థితి లేదు. ఒక్కటి హాస్పిటల్ లోనే కాదు దాదాపు చాలా హాస్పిటల్స్ లో అదే పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన నేపధ్యంలో అన్ని హాస్పిటల్స్ లో చికిత్స మొదలు పెడితే పరిస్థితి మారే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెడ్ల కొరతపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రభుత్వాస్పత్రుల్లో వీలైనన్ని బెడ్లను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించింది. బెడ్ల కొరతతో కరోనా బాధితులు అల్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 108 ప్రభుత్వాస్పత్రుల్లో ఐసీయూ, జనరల్ బెడ్లకు లోటు లేకుండా చూసుకోవాలి అని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2106 ఐసీయూ బెడ్లకు గాను సుమారు 1500 ఐసీయూ బెడ్లు ఖాళీగా ఉన్నట్టు చెబుతున్నారు. 4174 జనరల్ బెడ్లకు గానూ సుమారు 3 వేల బెడ్లు ఖాళీగా ఉన్నాయంటోన్న అధికారులు. జిల్లాల వారీగా బెడ్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలపాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.