NTV Telugu Site icon

ఎన్‌టీఆర్ ట్ర‌స్ట్ మ‌రో కీల‌క నిర్ణ‌యం…తెలంగాణ‌లో రెండు ఆక్సీజ‌న్ ప్లాంట్ ఏర్పాటు…

హైద‌రాబాద్‌లోని ఎన్‌టీఆర్ ట్ర‌స్ట్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  తెలంగాణ‌లో రెండు ఆక్సీజ‌న్ జ‌న‌రేష‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చింది.  ఈ విష‌యాన్ని ఎన్‌టీఆర్ మేనేజింగ్ ట్ర‌స్టీ నారా భువ‌నేశ్వ‌రీ తెలిపారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నాలుగు ఆక్సీజ‌న్ ప్లాంట్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని, తెలంగాణ‌లో కూడా రెండు ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు నారా భువ‌నేశ్వ‌రీ తెలియ‌జేశారు.  అనాథ శ‌వాల‌కు అంతిమ సంస్కారం ఏర్పాటుకు సేవా విభాగం ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు.  టెలి మెడిసిన్‌, మందుల పంపిణీ, క‌రోనా రోగుల‌కు నిరంత‌ర సేవ‌లు చేస్తున్న‌ట్లు ఎన్‌టీఆర్ ట్ర‌స్ట్ తెలియ‌జేసింది.  క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోదైన స‌మ‌యంలో ఆసుప‌త్రుల్లో చేరిన వ్య‌క్తుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది.  రోజూ వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి.