Site icon NTV Telugu

Sabitha Indra Reddy:టెట్ వాయిదా వేయండి.. మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న NSUI

Sabitha

Sabitha

మీర్‎పేట్ రహదారిపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. NSUI నాయకులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‎ని అడ్డుకున్నారు. టెట్ పరీక్షను వెంటనే వాయిదా వేయ్యాలని డిమాండ్ చేశారు. మీర్‎పేట్‎లో కార్యక్రమంలో మంత్రిని కలిసి వినతి పత్రాన్ని NSUI నాయకులు అందించే ప్రయత్నం చేశారు. మంత్రిని కలవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో కాన్వాయ్‎కి అడ్డుపడ్డారు. దీంతో మీర్‎పేట్‎లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా NSUI అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సహా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి మీర్‎పేట్ స్టేషన్‎కు తరలించారు.

కాగా.. టెట్‌ను వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్‌ ద్వారా డిమాండ్‌ చేశారు. ఆర్‌ఆర్‌బీ, టెట్‌ రెండు ఒకే రోజున ఉండడం వల్ల ఒకదానికి మాత్రమే హాజరయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఉద్యోగం ఆశించే నిరుద్యోగులు… ఇందులో రెండింటికి హాజరు కావాలని భావిస్తున్నారని తెలిపారు. ఆర్‌ఆర్‌బి అనేది జాతీయ స్థాయి పరీక్ష అని… ఇది వాయిదా వేయడం కుదరుదన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయి టెట్‌ను మరొక తేదీన నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. నిరుద్యోగుల ఆశలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే టెట్‌ను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.

Exit mobile version