Site icon NTV Telugu

Telangana Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు

Telangana Rains

Telangana Rains

Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం, శుక్రవారం ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అధికారులు కీలక సమాచారం అందించారు. రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోని దిగువ ట్రోపోస్పియర్‌లో తూర్పుగాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

Rain Alert: Rajasthan Elections 2023: రాజస్థాన్‌లో ఓటేసిన ప్రముఖులు.. 9 గంటల వరకు 9.77 శాతం పోలింగ్‌!

కాగా, శుక్రవారం (నవంబర్ 24) సిద్దిపేట జిల్లా సింగారంలో 60, ములుగు జిల్లా మేడారంలో 54, నల్గొండ జిల్లా తెల్తెవరపల్లిలో 43, హన్మకొండ జిల్లా దామెరలో 37, నల్గొండ జిల్లా చందంపేటలో 29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. , నాగర్ కర్నూల్ జిల్లా. వంకేశ్వరంలో 28, వరంగల్ జిల్లా నల్లబెల్లిలో 27, మేడిపల్లి, పాలకుర్తిలో 23 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 26న బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ చుట్టూ ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 27 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా పయనించి 29 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా వాయుగుండంగా బలపడుతుంది.

Rain Alert:Telangana Assembly Election 2023: ముంచుకొస్తున్న డెడ్‌లైన్‌.. స్పీడ్‌ పెంచిన లీడర్స్‌.. అగ్రనేతలంతా ఇక్కడే..!

ఏపీలోని కృష్ణా, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, పలనాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్‌ఆర్‌, అన్నమయ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 27 నాటికి అల్పపీడనం కాస్త బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు మూడు రోజుల పాటు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
Pawan Kalyan: నేడు తాండూరులో పవన్‌ కళ్యాణ్ పర్యటన..

Exit mobile version