పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగుల కల త్వరలోనే సాకారం కానుంది. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. 19 వేల పైచిలుకు కానిస్టేబుల్ పోస్టులు.. 625 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. పోలీస్ శాఖలో ఖాళీలను గుర్తించి ఆర్థిక శాఖకు నివేదిక పంపించారు డీజీపీ. ఆర్థిక శాఖ ఆమోదం రాగానే పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ జారీ కానుంది. ఇక తెలంగాణలో నూతన జోనల్ వ్యవస్థ కూడా అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
