Malla Reddy: బీఆర్ఎస్ నేత మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. శామీర్ పేట్ మండలంలోని బొమ్మరాసిపేట పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన కాపలా గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు అందాయి. జేసీబీల సాయంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చెరువులో నిర్మించిన రక్షణ గోడలను కూల్చివేశారు. అంతేకాకుండా.. పెద్ద చెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూల్చివేశారు.
నగర శివారులోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలోని సర్వేనెంబర్ 82, 83లో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య భూ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం రెండున్నర ఎకరాల భూమి తమదేనని వాదిస్తున్నారు. 1.11 ఎకరాల భూమి తమదని మరో 15 మంది చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం సర్వే నెం.82లోని స్థలంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మరో 15 మంది మధ్య వాగ్వాదం జరిగింది. ఒక్కొక్కరు 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశారని 15 మంది పేర్కొనగా, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
Read also: Hyderabad: ఆస్ట్రేలియాలో శవమై తేలిన హైదరాబాద్ యువకుడు.. సముద్రంలో మృతదేహం..
అయితే ఈ స్థలంపై కోర్టు ఉత్తర్వులు ఉన్నందున ఆ స్థలంలో ఎలాంటి గొడవలు జరగవద్దని పోలీసులు ఇరువర్గాలకు సూచించారు. అయితే మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని 15 మంది సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మల్లారెడ్డి బాధితులు సమావేశం నిర్వహించారు. మల్లారెడ్డిపై మరోసారి బాధితులు సంచలన ఆరోపణలు చేశారు.
పూలు, పాలు అమ్మడమే కాదు.. మల్లారెడ్డి భూకబ్జాలు కూడా చేస్తున్నాడని, మల్లారెడ్డి పేట్ బషీరాబాద్ సర్వే నంబర్ 82లో ఎకరాకు 29 గుంటల కంటే ఎక్కువగా ఉంటే మీకు సారీ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటానని… అయితే ఆయన ఆదివారం దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించిన సర్వేలో మల్లారెడ్డికి చెందిన ఎకరం 29 గుంటలతో పాటు మల్లారెడ్డికి చెందిన 33 గుంటలను చేర్చారు 29 గుంటలు మిగిల్చండి.. మా 33 గుంటలు మాకు ఇవ్వాలి మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి మాట మీద నిలబడాలని బాధితులు అన్నారు.
Etela Rajender: ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడం అసాధ్యం..
