Site icon NTV Telugu

నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా నోముల భగత్ ప్రమాణ స్వీకారం

ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా ఎన్నికైనా నోముల భగత్.. ఇవాళ స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డు ఈ సందర్భంగా నోముల భగత్ కు అందించారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి,ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, భాస్కర్ రావు,ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా.. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి పై టీఆర్ఎస్‌ అభ్యర్థిగా నోముల భగత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Exit mobile version