Site icon NTV Telugu

Ponguleti: ఖమ్మంలో పొంగులేటి హంగామా.. నామినేషన్ దాఖలు చేసిన శ్రీనివాస్ రెడ్డి

Poguleti

Poguleti

Ponguleti: అసెంబ్లీ ఎన్నికల కీలక ఘట్టం మొదలైంది. ఎన్నికల బరిలో పోటీని ఖరారు చేసే అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. తొలిరోజు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఆయన అనుచర వర్గం ఒక్కరిద్దరు కూడా ఈరోజు కొన్నిచోట్ల నామినేషన్ దాఖలు చేశారు. పాలేరు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన తరుపున సోదరుడు ప్రసాద్ రెడ్డి పాలేరు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు.

అదేవిధంగా పొంగలేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ముఖ్య అనుచరుడుగా ఉండి పినపాక అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా పాయం వెంకటేశ్వరరావు తమ నామినేషన్ దాఖలు చేశారు. పాయం వెంకటేశ్వర్లు నీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో ఈ రోజే పాయము వెంకటేశ్వర్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఇకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మరో ముఖ్య అనుచరుగా ఉన్న కోరం కనకయ్యకి ఇల్లందు నియోజకవర్గానికి పోటీ పడుతుండగా, ఆయన అభ్యర్థిత్వాన్ని ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయలేదు. అయితే పార్టీ ఇంతవరకు అభ్యర్థిగా ఖరారు చేయకపోయినప్పటికీ కోరం కనకే మాత్రం కాంగ్రెస్ పేరుతో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.

ఈ క్రమంలో మహానగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఆర్వో కేంద్రానికి వంద మీటర్ల దూరంలో 144 సెక్షన్ విధించి ఏర్పాట్లు చేశారు. తొలిరోజు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులే కాకుండా స్వతంత్ర, తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
Krithi Shetty: బ్లాక్ కలర్ శారీ అందాలతో కవిస్తున్న కృతి శెట్టి..

Exit mobile version