ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మళ్లీ ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు సిద్ధం అయ్యింది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే అన్ని స్కూళ్లను సిద్ధం చేశారు.. ఆన్‌లైన్ తరగతుల్లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్.. అయితే, రేపటి నుంచి కూడా ఆన్‌లైన్ తరగతులే కొనసాగుతాయింటూ ఉస్మానియా యూనివర్సిటీ సహా మరికొన్నియూనివర్సిటీలు నిర్ణయం తీసుకున్నాయి.. కాగా, ఆన్ లైన్ తరగతులపై యూనివర్సిటీల నిర్ణయంపై తెలంగాణ విద్యా శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా ఆన్‌లైన్‌లో విద్యాభోధన చేయాలని నిర్ణయం తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.. ప్రత్యక్ష తరగతులే నిర్వహించాలని స్పష్టం చేసింది.. దీంతో.. ఆన్ లైన్ క్లాసుల కొనసాగించే విషయంలో యూనివర్సిటీలు వెనక్కి తగ్గాయి… మంగళవారం నుంచి ప్రత్యక్ష తరగతులే నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్ టీయూ హెచ్ సహా మరికొన్ని యూనివర్సిటీలు కూడా నిర్ణయం తీసుకున్నాయి.
ఆన్‌లైన్ క్లాసులపై విద్యాశాఖ అసహనం.. ప్రత్యక్ష తరగతులకు రావాల్సిందే..
