Site icon NTV Telugu

Shabbir Ali: సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తాం..

Shabir Ali

Shabir Ali

Shabbir Ali: నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా, రేషన్ కార్డులపై ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్త పథకాలు ప్రారంభించినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయని అన్నారు. ఎమ్మెల్సీ కవిత, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇచ్చిన సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం.. గత ప్రభుత్వంలో రైతు బంధు దుర్వినియోగం అయ్యింది అని ఆయన ఆరోపించారు. మా సర్కార్ హయంలో కేవలం సాగు చేసే రైతులకు మాత్రమే మేము రైతు భరోసా ఇస్తామన్నారు.

Read Also: Atishi Marlena: కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై దాడి వారి పనే.. ముఖ్యమంత్రి అతిశీ ఫైర్

అయితే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా ఉండదు అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. రైతుల సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం.. కామారెడ్డిలో 8 విలీన గ్రామాల రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో లబ్ధి చేకూర్చుతాం.. రేషన్ కార్డులు జారీ అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. ఇక, గ్రామ సభలు పెట్టీ లబ్దిదారులను ఎంపిక చేస్తామని చెప్పుకొచ్చారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు.

Exit mobile version