Site icon NTV Telugu

Nizamabad Encounter: కానిస్టేబుల్ను హత్య చేసిన నిందితుడు.. చికిత్స పొందుతూ రియాజ్ మృతి..

Nzb

Nzb

Nizamabad Encounter: నిజామాబాద్ లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్ చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, రియాజ్ మృతిపై విభిన్న కథనాలు వినిపిస్తుండటంతో ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆదివారం నాడు పోలీసులు నిందితుడు రియాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు, ఓ యువకుడితో జరిగిన ఘర్షణలో గాయపడిన రియాజ్‌ను చికిత్స కోసం నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రియాజ్ చనిపోయినట్లు పేర్కొన్నారు.

Read Also: Bihar Elections: 143 మందితో జాబితా విడుదల చేసిన ఆర్జేడీ

అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చికిత్స పొందుతున్న రియాజ్ బాత్రూంకు వెళ్లే నెపంతో లేచాడు. ఈ సమయంలో సెక్యూరిటీగా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్ల దగ్గర నుంచి తుపాకీ లాక్కొని వారిపైనే దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, పోలీసులపై తుపాకీ ఎక్కు పెట్టి ఫైరింగ్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. రియాజ్ దాడి చేయడంతో ఒక కానిస్టేబుల్‌ గాయ పడ్డాడు. ఇక, పరిస్థితి విషమించడంతో సెక్యూరిటీగా ఉన్న మరొ కానిస్టేబుల్ ఆత్మరక్షణ కోసం ఫైరింగ్ చేశాడు. కాల్పులు జరపడంతో రియాజ్ తప్పించుకుని పారిపోతుండటంతో పోలీసులు కాల్పులు జరపినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన జీజీహెచ్‌లో కలకలం సృష్టించింది. అలాగే, రియాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

Exit mobile version