Uttam Kumar Reddy: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు గోర్గల్ గేటువ ద్ద ఏర్పటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్ల వద్దకు వెళ్తారు. నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం శ్రీరాం సాగర్ ప్రాజెక్టు సందర్శిస్తారు. అక్కడి నుంచి అధికారులతో సమీక్ష చేయనున్నారు.
Read also: New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు..
మంత్రి పర్యటన నేపథ్యంలో.. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోర్గల్ గేటు వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు పనులను ఆర్ అండ్ బీ డిప్యూటీ ఈఈకిషన్, జేఈ వినయ్‌కుమార్ పరిశీలించారు. హెలిప్యాడ్ తో పాటు మంత్రి పర్యటించే రూట్‌లో బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ, స్థానిక ఎస్సై శివకుమార్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ తోపాటు హెడ్‌స్లూయిస్ వద్ద మంత్రి పర్యటన ఏర్పాట్లను నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్, ఈఈ సోలోమాన్ పర్యవేక్షించారు. యాసంగి పంటలకు మంత్రి నీటిని విడుదల చేయనున్న సందర్భంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
Constitution Debate: నేడు పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ..