NTV Telugu Site icon

Verity Festival: గ్రామ పెద్దలకు పోలీసుల నోటీసులు.. పిడిగుద్దులాటపై ఉత్కంఠ!

Pidiguddulu

Pidiguddulu

Verity Festival: నిజామాబాద్ జిల్లాలోని సాలూరా మండలం హున్సలో పిడిగుద్దులాట ఆగడం లేదు. హోలీ పండుగ రోజు నిర్వహించే ఆటకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. గ్రామంలోని యువకులు ఈ ఆటను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో పురుషులు తాళ్లకు ఇరువైపులా చేరుకొని పిడికిళ్లతో ఒకరిపై మరోకరు గుద్దుకుంటారు. ఈ ఆటను నిర్వహించకపోతే మా గ్రామానికి అరిష్టమని చెబుతున్నారు.

Read Also: Alia Bhatt : అందులో భాగం అవుతున్నందుకు భయంగా ఉంది..

ఇక, సంప్రదాయం పేరుతో, అనాదిగా వస్తున్న ఆచారం పేర్లు చెప్పి జరుపుకునే పిడిగుద్దులాట ప్రమాదకరమని పోలీసులు తెలియజేస్తున్నారు. ఇలా, ఒకరిపై ఒకరు పడి పిడిగుద్దులతో విరుచుకు పడటంతో దెబ్బలు తగిలి గాయాలు కావడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. దీంతో ఈ ఆటకు అనుమతి లేదన్నారు. ఆట ఆడితే కేసులు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. గ్రామ పెద్దలకు నోటీసులు అందజేశారు. సాంప్రదాయ పండగకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం పట్ల గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండగను ప్రశాంతంగా జరుపుకుంటాం అనుమతి ఇవ్వలంటున్న గ్రామస్తులు కోరారు. హున్సాలో పిడిగుద్దులు ఆటపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవ్వరు ఎన్ని ఆంక్షలు పెట్టిన పిడిగుద్దులాట అడి తీరుతామని గ్రామస్థులు తేల్చి చెప్పారు.