Holi in Nizamabad: ప్రతి సంవత్సరం హోలీ పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్సాలో పిడిగుద్దుల ఆటను నిర్వహిస్తారు. వందల ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది. హోలీ రోజు గ్రామస్తులు పండుగ పిడిగుద్దుల ఆడేందుకు వారం రోజులుగా సాధన చేస్తారు. పండుగ రోజు గ్రామ చావిడి వద్ద గ్రామస్తులు రెండు గ్రూపులుగా విడిపోతారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత డప్పులు, వాయిద్యాలతో ఊరి పెద్దలను చావడి వద్దకు తీసుకువస్తారు. చావిడికి ఇరువైపులా బలమైన కట్టెలు పాతి వాటి మధ్య తాడు కడతారు. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి మధ్యలో తాడు పట్టుకుని ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపిస్తారు. ఇది 15 నుండి 30 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు కూడా పిడిగుద్దుల ఆటలో పాల్గొంటారు. ఈ ఆటను చూసేందుకు జిల్లా ప్రజలే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పెద్దఎత్తున తరలివస్తున్నారు. పండుగ రోజు గ్రామంలో కుస్తీ పోటీలు, జాతరలు నిర్వహిస్తారు.
Read also: India-Pakistan Relations: భారత్తో మెరుగైన సంబంధాల కోసం పాకిస్థాన్లో డిమాండ్..
అయితే గ్రామస్తులు పండుగ పిడిగుద్దుల ఆటలకు పోలీసులు అనుమతి లేదంటున్నారు. దీనిపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఐక్యమత్యంతో పిడిగుద్దులాట కొనసాగిస్తామని అంటున్నారు. ఎటువంటి ఎవరికి జరగదని పిడిగుద్దులాట అనాధిగా వస్తున్న ఆచారమణి తెలిపారు. ఈ ఆచారాన్ని వదులుకోమని లేదంటే గ్రామానికి అరిష్టమని పోలీసులకు చెబుతున్నారు. ఈ ముష్టియుద్ధం ఆడకపోతే ఊరికి అరిష్టమని, ఏడాది పాటు ఆడకపోతే ఊరిలో ట్యాంకు కూలిపోయి నష్టం జరిగిందని అంటున్నారు. అందుకే తప్పని పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం ఈ పిడిగుద్దుల ఆటను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇదే తమ విశ్వాసమని, ఈ పిడిగుద్దుల ఆట దెబ్బలు తగిలినా.. త్వరలోనే మానిపోతాయని అంటున్నారు. కానీ గ్రామానికి అరిష్టం జరిగితే అందరూ అనుభవించాల్సి ఉంటుందని వేడుకుంటున్నారు. మరి హున్సా గ్రామస్థులకు పోలీసులు అనుమతి ఇస్తారా? లేదా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
Top Headlines @ 9 AM : టాప్ న్యూస్