NTV Telugu Site icon

Nizamabad: నిజామాబాద్‌లోని మార్కెట్ యార్డుకు పోటెత్తిన పసుపు..

Nizamabad Pasupu

Nizamabad Pasupu

నిజామాబాద్‌లోని మార్కెట్ యార్డుకు పసుపు పోటెత్తింది. 50 వేల బస్తాలకు పైగా అమ్మకానికి పసుపు రావడంతో రైతులతో మార్కెట్ యార్డ్ మొత్తం సందడిగా మారింది. కనీస మద్దతు ధరతో కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మార్కెట్ యార్డ్ ముట్టడించి అక్కడి నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ తీశారు. బస్టాండ్ ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. దీంతో.. నిన్న పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో వ్యాపారులు రైతులతో జరిపిన చర్చల ముగిశాయి. కటాఫ్‌కు 500 ధర తగ్గిస్తే పసుపు యథావిధిగా కొనుగోలు చేస్తామంటూ వ్యాపారులు తేల్చిచెప్పడంతో చేసేదేమీ లేక రైతులు ఒప్పుకున్నారు.

Read Also: Vikram : విక్రమ్ సినిమా తెలుగు స్టేట్స్ మంచి ధర పలికింది

దీంతో.. క్వింటాకు 500 ధర తగ్గిస్తూ, క్వింటాల్ పసుపు 9500 రూపాయలకు కొనుగోలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్ యార్డుకు పసుపు రైతులు పోటెత్తారు. పసుపు కొనుగోళ్లపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీజన్ ప్రారంభం నుంచి క్వింటాల్‌కు 2 వేలకు పైగా ధర పతనం అయ్యిందని పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం క్వింటాల్‌కు రూ.18000 వరకు ధర పలుకగా.. ఈసారి రూ. 10వేల లోపు కనీస ధర పలుకుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యత వంకతో ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ చైర్మన్ చెబుతుండటంపై రైతులు తప్పు పడుతున్నారు. వ్యాపారులు, మార్కెట్ కమిటీ అధికారులు కుమ్మక్కయ్యారని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.

Read Also: Gold Rate Today: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?