BIG Breking: నిజమాబాద్ జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నీలకంటేశ్వరాలయంలో అపచారం జరిగింది. పుష్కరిణిలో దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈ.ఓ.వేణు సరస్సులో దిగి స్నానం చేశారు. దేవుని విగ్రహాలు అభిషేకం చేస్తున్నాము.. పుష్కరిణిలో ఈత కొట్టద్దు అంటూ అర్చకులు వారిస్తున్నా ఈవో వినిపించుకోకుండా ఈత కొట్టడం సంచలనంగా మారింది. అభిషేకం జరుగుతున్నా అస్సలు పట్టించుకోకుండా దర్జాగా ఈఓ ఈత కొట్టడం పలు విమర్శలకు దారితీస్తోంది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారడంతో ఈవో వేణుపై విమర్శలు వెల్లువెత్తాయి. నాలుగు ఆలయాలకు వేణు ఇంచార్జీ ఈఓ గా పనిచేస్తున్నారు. ఈవో వేణు తీరుపై భక్తులు మండిపడు తున్నారు.
Read also: Alibaba Jobs: రండి బాబు రండి మా దగ్గర ఉద్యోగాలున్నాయ్.. ఆలీబాబా ఆఫర్
ఇంచార్జీ ఈఓగా ఉంటూ పుష్కరిణిలో విగ్రమాలు అభిషేకం చేస్తున్న పట్టించుకోకుండా ఈత కొట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నారనే ధీమాతోనే ఈఓ ఇలా చేశాడంటూ సర్వత్రా మండిపడుతున్నారు. విగ్రహాలు అభిషేకం చేస్తున్నామని ఈత కొట్టకూడదని అర్చకులు వాదిస్తున్నా ఈఓ వేణు ఈత కొట్టడం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఎదురుగా వెళ్లి ఈఓ ఈత కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తు వారిని శిక్షించాల్సింది పోయి ఆలయ ఈఓగా వున్న వేణు ఈవిధంగా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈఓ స్థానంలో పనిచేస్తున్న వేణును తక్షణమే కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇలాంటి వారి వల్లే ఆలయంలో అపచారాలకు చోటుచేసుకుంటోందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వీడియోపై ఉన్నత స్థాయి అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.