NTV Telugu Site icon

Nizamabad CI Arrest: పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో ట్విస్ట్.. నిజామాబాద్ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్..!

Nizamabad Ci Arrested In Hit And Run Case

Nizamabad Ci Arrested In Hit And Run Case

Nizamabad CI Arrest: మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి కారణమైన యువకుడిని నిర్దోషిగా విడుదల చేసిన కేసు రోజుకో మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిజామాబాద్ సీఐని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసులో మరో ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో నిజామాబాద్ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరుడు అబ్దుల్ వాహే ఉన్నారు. నిందితుడు సాహిల్ తప్పించుకోవడంలో వీరిద్దరూ కీలకపాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. తాజా అరెస్టులతో ఈ కేసులో నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. రోడ్డు ప్రమాదం తర్వాత దుబాయ్‌కు పారిపోయిన ప్రధాన నిందితుడు సాహిల్‌, అతని తండ్రి మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విద్యాశాఖ ఇన్ స్పెక్టర్ గా పనిచేసిన ప్రేమ్ కుమార్ ఇటీవల నిజామాబాద్ కు బదిలీపై వచ్చారు. విధుల్లో చేరాల్సిన ప్రేమ్‌కుమార్‌ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. డిసెంబరు 23వ తేదీ అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అలియాస్‌ రాహిల్‌ బేగంపేటలోని ప్రజాభవన్‌ వద్ద బీహెచ్‌డబ్ల్యూ కారును అతి వేగంతో నడుపుతూ ట్రాఫిక్‌ డివైడర్లను ఢీకొట్టాడు.

Read also: Tummala: సత్తుపల్లిలో ఫుడ్ ఫార్క్.. ఫిబ్రవరిలో ప్రారంభించేది ఆయనే..

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఈ కేసులో అసలు నిందితుడిని విడుదల చేశారు. ప్రమాదానికి మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ కారణమని పంజాగుట్టలో కేసు నమోదైంది. నిజామాబాద్ సీఐ పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ దుర్గారావుతో ఫోన్ లో మాట్లాడి కేసు తారుమారు చేసేందుకు సహకరించినట్లు విచారణలో తేలింది. స్టేషన్ నుంచి సాహిల్‌ను విడిపించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నిందితుల సెల్‌ఫోన్లలో లభించిన కాల్ డేటా ఆధారంగా ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరితో షకీల్ మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసులో జోక్యం చేసుకున్నారనే అనుమానంతో ప్రేమ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన సాహిల్‌ను ముంబైకి పంపడంలో షకీల్ అనుచరుడు అబ్దుల్‌వాహే ప్రమేయం ఉన్నట్లు తేలింది. నిందితులను విడిచిపెట్టిన ఇన్ స్పెక్టర్ దుర్గారావుపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అసలు నిందితుడిపై కాకుండా మరొకరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Bandi sanjay: కేటీఆర్‌ ని బీఆర్ఎస్ పార్టీ నే పట్టించుకునే పరిస్థితి లేదు.. బండి కీలక వ్యాఖ్యలు