Site icon NTV Telugu

నీటిమయమైన నిర్మల్ జిల్లా.. రోడ్లపై భారీగా చేపలు

నిర్మల్ జిల్లా నీటిమయమైంది. జిల్లా అంతటా ఎటు చూసినా వరదలే కనిపిస్తున్నాయి. ప్రధాన వీధులు శివారు ప్రాంతాలు జలమయమైయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమములోనే రహదారులపైకి భారీగా చేపలు వచ్చాయి. దీంతో పలువురు స్థానికులు రోడ్లపై చేపలు పట్టారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక నిర్మల్ వ‌ర‌ద ప‌రిస్థితిపై మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డితో సీఎం కేసీఆర్ ఆరా తీశారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Exit mobile version