Site icon NTV Telugu

Basara Triple IT: బాసర ట్రిపుల్ ఐటీలో మెస్ టెండర్ల ఎంపిక ప్రక్రియపై స్థానికుల అనుమానాలు..

Iit

Iit

Basara Triple IT: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో నాలుగు మెస్ టెండర్ల ఎంపిక ప్రక్రియపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోని కాంట్రాక్టర్లకే మళ్ళీ అప్పగించేలా చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. వీసీ గోవర్థన్ పైనా నమ్మకం లేదు.. అర్హతలు కలిగిన టెండర్లు వేసిన వారిని కావాలనే రిజెక్ట్ చేశారు అంటూ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఆరోపణలు ఉన్న ఆ ముగ్గురు కాంట్రాక్టర్లకే అప్పగించేలా లోపాయికారి ఒప్పందాలు కూర్చుకొన్నారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.

Read Also: PM Modi Amaravati Visit: ప్రధాని మోడీ పర్యటన.. అమరావతిని జల్లెడ పడుతున్న ఎస్పీజీ..!

అయితే, టెండర్ల ఎంపికలో కలెక్టర్ల పాత్ర లేకుండానే చేస్తున్నారు అని స్థానికులు తెలిపారు. మళ్లీ పాత వారికే నాలుగు మెస్ లను కేటాయిస్తే తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తామని బాసర ప్రజలు హెచ్చరిస్తున్నారు. స్థానికులు చేసిన ఆరోపణలకు బాసర ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ గోవర్థన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెండర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.. ఇప్పటి వరకు ఎవ్వరికి ఇంకా టెండర్లు అనేది నిర్ధారించలేదు అని తేల్చి చెప్పారు. టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యాక మరిన్నీ వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు.

Exit mobile version