Preeti Health Bulletin: డాక్టర్ ప్రీతి హెల్త్ బులిటెన్ ను నిమ్స్ వైద్యులు రిలీజ్ చేశారు. డాక్టర్ ప్రీతి ఇంకా ఎక్మా సపోర్టుతోనే వెంటిలేటర్ పైన ఉందని వెల్లడించారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని అన్నారు. ప్రీతికి ప్రామణిక మార్గదర్శకాలు, ప్రోటోకాల్ ప్రకారం వైద్య చికిత్సను అందిస్తున్నామన్నారు వైద్యులు. ప్రీతిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఆమెకు అవసరమైన వైద్య చికిత్సను ప్రత్యేక స్పెషలిస్ట్ లో వైద్య బృందం అందిస్తోందని నిమ్స్ వైద్యులు వెల్లడించారు.
Read also: Nizamabad College: మరో మెడికో విద్యార్థి ఆత్మహత్య.. హాస్టల్ రూంలోనే ఉరివేసుకుని
కాగా.. కాకతీయ మెడికల్ కాలేజ్‌లో పీజీ ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన సంచలనంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీంతో సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య యత్నంచినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక.. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. దీంతో.. సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. ఇక శుక్రవారం సైఫ్‌ను హన్మకొండలోని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం సైఫ్‌ను ఖమ్మం జైలుకు తరలించారు. ఇక మరోవైపు ప్రీతి ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. మెడికో ప్రీతికి ఎక్మో ద్వారా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని, ప్రీతిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా వైద్యులు చెప్పారు.
Nalgonda love Story: ప్రేమదేశం సినిమా రిపీట్.. విషాదంగా క్లైమాక్స్