NTV Telugu Site icon

NIA inspections: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. నిజామాబాద్‌లోనే 22 మందిని..

Nia Raids In Telugu States

Nia Raids In Telugu States

NIA inspections: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపింది.. నిజామాబాద్, హైదరాబాద్, కర్నూలు, కడపా, గుంటూరులో ఎన్ఐఏ రైడ్స్ నిర్వహించారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే.. పీపుల్స్ ఫ్రంట్ ఇండియా కార్యకలాపాలపై ఎన్ఐఏ ఆరా తీసింది. ఇక ఉగ్రవాద సంస్థలతో పీఎఫ్ఐ సంబంధాలపై విచారణ నిర్వహిస్తున్నారు. అయితే.. ఒక్క నిజామాబాద్‌లోనే 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 22 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇక.. నిజామాబాద్‌లో ఛారిటీ పేరుతో ఫండ్స్ వసూలు చేసి ఉగ్రవాద కార్యకలాపాలు పాల్పడుతున్నారన్న కారణంతో సయ్యద్ షాహిద్‌కు ఎన్ఐఏ నోటీసులు అందించింది.

అయితే.. గత నెల 28న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు.. ఈ నెల 19న హైదరాబాద్‌లో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు చేశారు. ఇక నిజామాబాద్‌లో అబ్ధుల్ ఖాదీర్ నేతృత్వంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి 200 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో.. కేరళ, ఢిల్లీ, కర్ణాటకలతో కూడా పీఎఫ్ఐ కార్యకలాపాలు ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది. అంతేకాకుండా.. నిర్మల్ జిల్లా బైంసాలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక మదీనా కాలనీలో అధికారులు సోదాలు చేపడుతున్నారు.. ఈనేపథ్యంలో.. రాత్రి మూడు గంటల నుంచి అన్ని ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఇక పీపుల్స్ ఫ్రంట్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయన్న కారణంతోనే ఈ దాడులు నిర్వహించి అనుమానితులను అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.