Site icon NTV Telugu

NIA Raids In Suraram Colony: సూరారం సాయిబాబా నగర్ లో NIA సోదాలు

Nia1

Nia1

తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో ఆదివారం తెల్లవారుజామున NIA బృందం తనిఖీలు ప్రారంభించింది. సూరారాం సాయిబాబనగర్ లోని పలు ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకుంది. పి ఎఫ్ ఐ సంస్థలో సభ్యత్వం ఉన్న వ్యక్తి ని విచారించింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ డివిజన్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సూరారం సాయి బాబా నగర్ లో ఎన్ ఐ ఏ కొన్ని ఇళ్ళల్లో సోదాలు జరిపారు.

ఆదివారం తెల్లవారు జమున స్కార్పియో, బొలెరో వాహనాలలో పదుల సంఖ్యలో సాయుధులైన కొందరు వ్యక్తులు స్థానికంగా ఉన్న గిరి హాస్పిటల్ సమీపంలో వాహనాలను ఆపుకొని అనంతరం పలు బృందాలుగా విడిపోయి అనుమానితుల ఇళ్ళల్లో తనిఖీలు చేసినట్లు సమాచారం. స్థానికంగా నిర్వహిస్తున్న గర్ల్స్ మదర్శాలో బృందం విసృత తనిఖీలు చేపట్టింది. పి ఎఫ్ ఐ తో సంబంధం ఉన్న వహీద్ అనే వ్యక్తిని విచారించినట్లు సమాచారం. ఉదయమే వాకింగ్ కు వెళ్తున్న సమయంలో పెద్ద పెద్ద గన్ లను పట్టుకుని కొందరు హడావిడి చేశారు.

Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ అధ్యక్షుడు కావాలి.. తీర్మానాలు చేస్తున్న రాష్ట్రాలు..

తనిఖీలకు వచ్చిన ఎన్ ఐ ఎ ఆయా తనిఖీల ప్రాంతాల నుంచి సీసీ టీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వచ్చిన ఎన్ ఐ ఎ బృందం తెల్లవారు జామున 5 గంటల సమయంలో వచ్చి దాదాపు గా 9, 10 గంటల వరకు తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో ఏం స్వాధీనం చేసుకున్నారో తెలియాల్సి వుంది.

Read Also: Perni Nani: చిరంజీవి నిఖార్సైన నాయకుడు.. పవన్ వీకెండ్ నాయకుడు

Exit mobile version